Indian Foods: నేటి కాలంలో పని ఒత్తిడి వల్ల ఆహారం సిద్ధం చేయడానికి సమయం ఉండటం లేదు. అందుకే ప్రజలు ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీం, కేకులు, పిజ్జాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య విషయానికి వస్తే ఇవి మంచి ఆహారాలు కావు. ఇవి ఆ సమయంలో ఆకలిని తీర్చినప్పటికీ శరీరానికి మాత్రం హాని చేస్తాయి. ఇలాంటి ఆహారపదార్థాలు అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే కానీ ఎప్పుడూ అవే తినకూడదు. దీర్ఘకాలం వీటిపై ఆధారపడటం వల్ల రకరకాల రోగాలకి గురికావల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఇండియన్ ఫుడ్స్‌ని తినవచ్చు. వీటివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. బరువు పెరిగే సమస్య అస్సలు ఉండదు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. భేల్ పూరి: ఇంట్లో ఉండే సాదా పదార్థాలతో భేల్ పూరీని తయారు చేసుకోవచ్చు. కూరగాయలు, నిమ్మరసం, టొమాటోలతో చేసిన భేల్ పూరీ భలే రుచిగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఎంపిక.
2. రసం, పప్పు: భారతదేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రసిద్ధ రుచికరమై వంట పప్పు, రసం. పప్పు రుచికరమైనవి మాత్రమే కాదు ఇందులో ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆహారాలు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా సంతృప్తిగా ఉంటుంది.
3. ఖిచ్డీ: ఖిచ్డీ సరిగ్గా తయారు చేస్తే చాలా పోషకమైనది. ఫాస్ట్ ఫుడ్స్‌కు బదులుగా కిచ్డీని తినవచ్చు.
4. ఇడ్లీ సాంబార్: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇడ్లీ సాంబార్ మన దేశంలో కూడా చాలా ఫేమస్. ఇది రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎటువంటి హాని చేయవు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి