Winter Tips: చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? ఆ సమస్యలు తప్పవంటోన్న నిపుణులు

|

Nov 20, 2022 | 8:29 AM

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. అలాగే వేడి నీళ్లతో స్నానం శరీరానికి అనేక రకాలగా నష్టం కలగజేస్తుంది.

Winter Tips: చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? ఆ సమస్యలు తప్పవంటోన్న నిపుణులు
Bath
Follow us on

చలికాలం మొదలైంది. ఇప్పటికే చాలామంది స్వెట్టర్లు, మఫ్లర్లు వంటి శరీరానికి వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. ఇక శీతాకాలంలో స్నానం అంటే చాలామంది బద్ధకిస్తారు. వేడి నీళ్లు ఉంటే కానీ స్నానం చేయరు. కాగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గిపోతుంది. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అయితే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ముఖ్యంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. అలాగే వేడి నీళ్లతో స్నానం శరీరానికి అనేక రకాలగా నష్టం కలగజేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మంలోని కెరాటిన్ కణాలు వేడి నీటి వల్ల దెబ్బతింటాయి. చాలా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తొలగిపోయి చర్మం మెరుపు తగ్గుతుంది. అలాగే ఇది శరీరంలో ఎరుపు, దద్దుర్లు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

కళ్లపై ప్రతికూల ప్రభావం..

పొగలు కక్కే వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు కూడా పెద్దవిగా మారుతాయి. దీని కారణంగా దుమ్ము, ధూళి, మురికి చాలా సులభంగా చర్మంలోకి వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కళ్లపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కళ్లలోని తేమ తగ్గిపోతుంది. దీని కారణంగా, కళ్ళు ఎర్రబడటం, దురద, తరచుగా నీరు కారడం వంటి సమస్యలు ఉండవచ్చు. కళ్ల చుట్టూ చర్మం ముడతలు పడవచ్చు. అందుకే శీతాకాలంలో సాధారణ నీటితో మాత్రమే స్నానం చేయడం మంచిది. ఇక వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుందని అంటున్నారు నిపుణులు. వేడి నీటి కారణంగా మీ శరీరం రిలాక్స్‌డ్‌గా మారిపోతుంది. మీ మనస్సు పని చేయడానికి బదులు కునుకు తీస్తుంది. ఇది మీ శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి బదులుగా సోమరితనాన్ని అలవాటు చేస్తుంది.

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..