AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహంతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో కంట్రోల్‌లో పెట్టండి..

ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధికి..

Diabetes: మధుమేహంతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో   కంట్రోల్‌లో  పెట్టండి..
Diabetes
Amarnadh Daneti
|

Updated on: Nov 19, 2022 | 10:27 PM

Share

ఆధునిక కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈవ్యాధికి కారణమని ఎంతో మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడక ద్వారా మధుమేహనికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. వాకింగ్ ద్వారా రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే వ్యాధి కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించవచ్చు. ఉదయం పూట కొన్ని వ్యాయామాలు చేయాలని, అలా చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందంటున్నారు నిపుణులు. మధుమేహం వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

మార్నింగ్ వాకింగ్

వాకింగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను నివారిస్తుంది. ఇప్పటికే మధుమేహం వ్యాధి ఉన్న వారు రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల వ్యాధి మరింత ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏరోబిక్స్

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఏరోబిక్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం ఐదు రోజులు ఏరోబిక్ డ్యాన్స్ చేస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా మధుమేహం ఉన్న వ్యక్తిలో సానుకూల మార్పును చూపుతుంది.

ఇవి కూడా చదవండి

సైక్లింగ్

వ్యాయామంలో సైక్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అనేక ఇతర రుగ్మతలను కూడా నయం చేస్తుంది.

ప్రాణాయామం

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ప్రాణాయామం, శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Follow Us
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు