శరీరంలో జీవసంబంధ విధులు నిర్వర్తించాలంటే కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. అయితే ఈ కొవ్వులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ మరొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హృద్రోగ సమస్యల నుంచి అధిక బరువు వరకు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మరీ ముఖ్యంగా మారిన జీవన విధానం, ఆహారపు అలావాట్ల కారణంగా అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు చాలా రోజుల తర్వాత కానీ తెలియదు. కానీ కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగినట్లు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే కనిపించే లక్షణాల్లో శరీరం రంగు మారడం ఒకటి. దీనివల్ల శరీరం క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే కళ్ల చుట్టూ చిన్న చిన్న మొటిమలు అవుతుంటాయి. ఇలాంటి లక్షనాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
* మొహంపై తరుచుగా దురదగా అనిపించినా చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణమని భావించాలి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి. ఇక దురదతో పాటు మొహం ఎర్రగా మారినా అధిక కొలెస్ట్రాల్ లక్షణమే.
* శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మొహంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తుంటాయి. అలాగే కళ్లు, ముక్కు చుట్టూ ఎర్ర రంగులో చిన్న చిన్న మొటిమలు వస్తుండడం గమనించవచ్చు.
* శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిన వారిలో మొహంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. సహజంగా ఇవి చెమట వల్ల వచ్చే ర్యాషెస్ అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ ర్యాషస్ ఇతర కారణాలతో వచ్చినా, వీటికి అధిక కొలెస్ట్రాల్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..