Guava Benefits: పరగడుపున జామ పండు తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Guava Benefits: కాలంతో సంబంధం లేకుండా దాదాపు అన్ని కాలాల్లో దొరికే పండ్లలో జామ ఒకటి. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జా సొంతం. ధర విషయంలోనూ ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ కావడం జామ పండుకు ఎక్కువ మంది ఇష్టపడడం ఓ కారణంగా చెప్పవచ్చు...

Guava Benefits: పరగడుపున జామ పండు తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2022 | 4:30 PM

Guava Benefits: కాలంతో సంబంధం లేకుండా దాదాపు అన్ని కాలాల్లో దొరికే పండ్లలో జామ ఒకటి. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జా సొంతం. ధర విషయంలోనూ ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ కావడం జామ పండుకు ఎక్కువ మంది ఇష్టపడడం ఓ కారణంగా చెప్పవచ్చు. జామలో పుష్కలంగా లభించే విటమిన్‌ సి, పొటాషియం, ఫైబర్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక జామ పండును పరగడుపున తీసుకుంటే రెట్టింపు లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? జామ పండు పరగడుపున తీసుకుంటే ఈ లాభాలను సొంతం చేసుకోవచ్చు. అవేంటంటే..

* జామ పండులో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఉపయోగపడుతుంది. దీంతో తరచూ జబ్బుల బారినపడే వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.

* జామలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కారణంగా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ క్యాలరీలతో అవసరమైన విటమిన్‌లు అందుతాయి. ఒక్క జామ పండులో కేవలం 37 క్యాలరీస్‌ ఉండడం విశేషం. కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు వెంటనే వారి డైట్‌లో జామను భాగం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఫైబర్‌ పుష్కలంగా ఉండే జామ పండ్లను తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ రేటు మెరుగువతోంది. విరేచనాలకు జామ చెక్‌ పెడుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది.

* కొంత మంది మహిళలు నెలసరి సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు జామ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కేవలం జామ పండే కాకుండా జామ ఆకు తీసుకోవడం వల్ల ఈ నొప్పికి చెక్‌ పెట్టొచ్చు.

* జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగువతోంది. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకుంటుంది. బీపీ సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది.

* జామలో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్లుగా ఉపయోగపడుతాయి. జామ పండ్లలోని లైకోపీన్ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. అలాగే రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుంది.

* డయాబెటిక్‌ రోగులకు జామ పండ్లు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి. జామలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ తక్కువగా ఉండే గ్లైసెమిక్ కారణంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

* జామలోని యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు దంతాలకు రక్షణ ఇస్తుంది. పంటి నొప్పులు, నోటి అల్సర్లకు జామ ఆకులతో తయారు చేసిన టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది.

* జామపండులో ఉండే విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి చూపు క్షీణతను నివారించడమే కాకుండా, కంటి శుక్లం వంటి సమస్యలను దరిచేరనివ్వదు.

నోట్‌: ఇక్కడ తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించాము. అయితే పరగడుపున జామ తీసుకోవడం ద్వారా కొందరిలో గ్యాస్‌, అలర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యుల సూచన మేరకు జామను పరగడుపున తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!