Best Sleep: నిద్రలేమితో బాధపడుతున్నారా..? మంచి నిద్ర పోవాలంటే ఈ పదార్థాలు తీసుకోండి..!

| Edited By: Shaik Madar Saheb

Jul 02, 2021 | 9:23 AM

Best Sleep: చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల చాలా..

Best Sleep: నిద్రలేమితో బాధపడుతున్నారా..? మంచి నిద్ర పోవాలంటే ఈ పదార్థాలు తీసుకోండి..!
Follow us on

Best Sleep: చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అయితే ఆరోగ్యానికి పోషక ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగ్గా లేనివారికి ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. అదే విధంగా నిద్రలేకపోవడం వల్ల చేసే పనుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. ఉత్సాహం ఉండదు. ఇవే కాదు సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి నిద్ర పోవడానికి ఈ పదార్థాలు నిద్రపోయే ముందు తీసుకుంటే మంచిదంటున్నారు. మరి అవి ఎలాంటివో చూద్దాం.

అరటిపండు:

అరటి పండు వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్‌ బి6 ఉంటుంది. దీని కారణంగా మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో మెదడుకు నిద్ర పోవాలనే సిగ్నల్స్ ని పంపిస్తుంది. దీని వల్ల మీరు హాయిగా నిద్ర పోవచ్చు.

బాదం:

బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదం తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి నుండి డయాబెటిస్ వరకు ఎన్నో ప్రయోజనాలని పొందవచ్చు. ప్రతి రోజు నిద్ర పోవడానికి ముందు మూడు నుండి నాలుగు బాదంలను తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. బాదంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మజిల్స్ రిలాక్స్‌గా ఉంచుతుంది. దీంతో మీరు మంచి నిద్ర పోయేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

పాలు, గసగసాలు:

రాత్రుల్లో సరైన నిద్ర లేనివారికి మంచి నిద్రపోయేందుకు పాలు, గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. పాలల్లో కొద్దిగా గసగసాలు వేసుకుని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే ఒత్తిడి, నీరసం పూర్తిగా తగ్గిపోయి మంచి నిద్ర వస్తుంది. ఇవి నిద్రలేమికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవీ కూడా చదవండి:

Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే తాత్కాలిక పేస్‌మేకర్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు 

Cytomegalovirus: కరోనాతో బాధపడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్న మరో వైరస్.. ఢిల్లీ లో వెలుగులోకి