Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

|

Jan 20, 2022 | 8:42 AM

Paracetamol Side Effects: చిన్నపాటి దగ్గు లేదా జలుబు, లేకపోతే జ్వరం వస్తే చాలు మనలో చాలామంది హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటారు. పారాసెటమాల్..

Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!
Paracetmol
Follow us on

చిన్నపాటి దగ్గు లేదా జలుబు, లేకపోతే జ్వరం వస్తే చాలు మనలో చాలామంది హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటారు. పారాసెటమాల్(Paracetamol), డోలో(Dolo), క్రోసిన్(Crocin) తదితర టాబ్లెట్స్ మింగేస్తుంటాం. కరోనా రాకముందు నుంచి ఈ అలవాటు చాలామంది ఉంది. అయితే ఇప్పుడు కరోనా కాలం.. పైగా ఇళ్లలోనే సొంతంగా చికిత్స తీసుకోవడం అంత మంచిది కాదని వైద్యుల అభిప్రాయం. ఏ మాత్రం ఎంత మోతాదులో తీసుకోవాలో కచ్చితంగా తెలుసుకోవాలని అని వారు సూచిస్తున్నారు. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

పారాసెటమాల్ ఎంత మోతాదులో తీసుకోవాలి…

చిన్న పిల్లలైనా, పెద్దలైనా జ్వరం ఉన్నప్పుడు ఎంత మోతాదులో పారాసెటమాల్ తీసుకోవాలన్నది.. బాధితులకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, బరువు, ఎత్తు లాంటివి నిర్ణయిస్తాయని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దలకు జ్వరం వచ్చినప్పుడు 4-6 గంటల మధ్య వ్యవధిలో పారాసెటమాల్(325-650mg) టాబ్లెట్ తీసుకోవాలి. అలాగే జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత పారాసెటమాల్(500mg) టాబ్లెట్ తీసుకోవాలి. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే.. నెల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పారాసెటమాల్(10-15mg) టాబ్లెట్ 4-6 గంటల మధ్య వ్యవధిలో ఇవ్వాలి. ఇదే మోతాదులో 12 సంవత్సరాలు వయస్సు అంతకన్నా లోపు ఉన్న పిల్లలకు 6 నుంచి 8 గంటల మధ్య వ్యవధిలో ఇవ్వాలి. అలాగే పెద్దలకు ఒళ్లు నొప్పులు ఉంటే.. 4-6 గంటల మధ్య వ్యవధిలో పారాసెటమాల్(325-650mg) టాబ్లెట్ తీసుకోవాలి. ఇక చిన్న పిల్లలకు పారాసెటమాల్(10-15mg) టాబ్లెట్లు 6 నుంచి 8 గంటల మధ్య వ్యవధిలో ఇవ్వాలి.

ఎంతకీ జ్వరం తగ్గలేదని పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకున్న 2-3 గంటల్లోపే మళ్లీ మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని తెలుసుకోవాలి. టాబ్లెట్ వేసిన కొద్ది నిమిషాల్లోనే రిలీఫ్ పొందాలనుకోవడం కాని పని అని మీరు గుర్తించాలి. టాబ్లెట్ ఏదైనా కూడా అది మన శరీరంపై ప్రభావం చూపాలంటే కొంత సమయం పడుతుంది. ఒకవేళ ఎంతకీ జ్వరం తగ్గకపోతే మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. కాగా, జ్వరం, తలనొప్పి, పీరియడ్స్ నొప్పి, ఒళ్లు నొప్పులు, మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలకు పారాసెటమాల్ టాబ్లెట్లను ఉపయోగిస్తారు.

సహజంగా పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. 3 రోజుల నుంచి పారాసెటమాల్ టాబ్లెట్లు తీసుకుంటున్నా జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అటు లివర్, కిడ్నీ సమస్యలు, మద్యం అలవాటు ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పారాసెటమాల్ తీసుకోవద్దు. పారాసెటమాల్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అలెర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు, విరేచనాలు, చెమటలు పట్టడం, ఆకలి వేయకపోవడం, వాంతులు, కడుపుసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక :- వివిధ అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి. ఈ కథనంలోని అంశాలకు ‘టీవీ9 తెలుగు డిజిటల్, టీవీ9’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.