Diabetes Symptoms: డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో షుగర్ లెవల్ 600 దాటితే ఏం జరుగుతుందో తెలుసా.. ఈ పరిస్థితి రాకుండా ఇలా చేయండి..

|

Nov 21, 2022 | 3:06 PM

డయాబెటిక్ బాధితులు రక్తంలో చక్కెరను నియంత్రించకపోతే.. ఒక స్థాయి తర్వాత శరీరం కోమాకు చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా ఏం చేయాలంటే..

Diabetes Symptoms: డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో షుగర్ లెవల్ 600 దాటితే ఏం జరుగుతుందో తెలుసా.. ఈ పరిస్థితి రాకుండా ఇలా చేయండి..
Diabetes 600 Sugar Level
Follow us on

డయాబెటిస్ సమస్యకు అలోపతిలో మందులేదు. అదపులో  ఉంచుకోవడం ఒక్కటే మార్గం.  దీని లక్షణాలు నియంత్రించబడకపోతే చాలా తీవ్రంగా మారవచ్చు. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య, దీని బాధితుల సంఖ్య మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్నారు. మధుమేహం నియంత్రణలో లేకుంటే, దాని పెరుగుదల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె వంటి శరీరానికి అవసరమైన అవయవాలను దెబ్బతీస్తుంది. డయాబెటిస్ అనేది జీవక్రియకు సంబంధించిన వ్యాధి. దీనిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది లేదా తగ్గిస్తుంది. టైప్-1 డయాబెటిస్ రోగులు ఇన్సులిన్ లోపాన్ని తీర్చడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. అయితే టైప్-2 డయాబెటిస్ రోగులు సహజమైన ఆహారం, ఇన్సులిన్ లోపాన్ని తీర్చడానికి మందులు తీసుకుంటారు. మధుమేహం పెరగడం పెద్ద సమస్య. మధుమేహం ఒక స్థాయికి మించి పెరగడం కూడా మరణానికి కారణంగా మారుతుంది. బ్లడ్ షుగర్ 600 దాటితే డయాబెటిక్ కోమా స్థితికి వచ్చే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటిక్ కోమా అంటే ఏంటి అనే ప్రశ్న చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితికి కారణమేంటో.. దానిని ఎలా నిర్ధారించాలో తెలుసుకుందాం..

డయాబెటిక్ కోమా అంటే ఏంటి?

డయాబెటిక్ డిపార్ట్‌మెంట్, కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, లండన్ ఆస్పత్రి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం, డయాబెటిక్ కోమా అనేది ఒక వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది డయాబెటిక్ కోమాకు సంబంధించిన సమస్య. దీని కారణంగా రోగి మరణం కూడా సంభవించవచ్చు. ఈ స్థితిలో రక్తంలో చక్కెర 600mg/dl వరకు చేరుకుంటుంది. రోగి స్పృహ కోల్పోతాడు. డయాబెటిక్ కోమా సమస్య రక్తంలో చక్కెర అధికంగా ఉన్న రోగులకు మాత్రమే కాదు. చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. డయాబెటిక్ కోమా పరిస్థితి తలెత్తుతుంది.

డయాబెటిక్ కోమా పరిస్థితికి కారణం ఏంటి?

డయాబెటిక్ కోమాకు అతిపెద్ద కారణం రక్తంలో చక్కెర స్థాయి 600 mg/dL కంటే ఎక్కువగా ఉండటం. మూత్రంలో కీటోన్లు ఉండటం కూడా డయాబెటిక్ కోమాకు కారణం. రక్తం గట్టిపడటం వల్ల డయాబెటిక్ కోమా పరిస్థితి కూడా తలెత్తుతుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో మరొక పరిస్థితి డయాబెటిక్ కీటోయాసిడోసిస్. ఇది డయాబెటిక్ కోమాకు దారితీస్తుంది.

రక్తంలో చక్కెర 250 mg/dL కంటే తగ్గినప్పుడు డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సంభవిస్తుంది. శరీరం గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వు ఆమ్లాలను ఉపయోగించినప్పుడు కూడా డయాబెటిక్ కోమా సంభవించవచ్చు. డయాబెటిక్ కోమా అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. దీనికి తక్షణ చికిత్స అవసరం.

డయాబెటిక్ కోమాను ఎలా నివారించాలి:

  • ఈ పరిస్థితిని నివారించడానికి.. ముందుగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోండి.
  • చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం. రక్తంలో చక్కెర పెరిగితే.. వెంటనే మందులు తీసుకోండి.
  • శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈ వ్యాధి పెరగడానికి ఒత్తిడి ప్రధాన కారణం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం