ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఎండాకాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో శరీరం చాలా త్వరగా అలసిపోతుంది. అదే సమయంలో, వేడి కారణంగా ఏమీ తినాలని అనిపించదు. బలహీనత పెరుగుతుంది. ఈ సీజన్‌లో శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుందని, దాని వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా వేసవి కాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. మీ ఆహారంలో ఫ్రూట్ సలాడ్‌ను చేర్చుకోవాలి. ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో ఎలాంటి ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..
మిక్స్ ఫ్రూట్ సలాడ్: మిక్స్ ఫ్రూట్ సలాడ్ సమ్మర్ సీజన్ లో తప్పనిసరిగా తినాలి. ఈ సలాడ్ చేయడానికి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేయండి. దీని కోసం మీరు పైనాపిల్, కివి, బొప్పాయి, పుచ్చకాయ, ద్రాక్ష, యాపిల్, మామిడి ఇలా అన్ని రకాల పండ్లు ఉపయోగించవచ్చు. ఈ సలాడ్ తినడం వల్ల మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..