గొంతు నొప్పి సాధారణంగా జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. గొంతు నొప్పిని సాధారణ వ్యాధిగా పరిగణిస్తుంటారు. అయితే దీని వెనుక తీవ్రమైన కారణాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. CDC ప్రకారం, గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముక్కు కారటం, జ్వరం, దగ్గు, కండ్లకలకకు వంటి లక్షణాలు అనేక ప్రమాదకరమైన వ్యాధులను కూడా సూచిస్తాయి.
గొంతు నొప్పి కొన్నిసార్లు దానంతట అదే పోదు. అటువంటి పరిస్థితిలో అది స్ట్రెప్టోకోకల్ సమస్యకు దారితీయవచ్చు. అంటే స్ట్రెప్ థ్రోట్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిస్, చీముతో కూడిన కురుపులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకుని, వెంటనే దాని చికిత్సను ప్రారంభించవల్సి ఉంటుంది.
గొంతునొప్పి సమస్య అధికకాలం కొనసాగితే, అది క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. ఇది ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
కొన్నిసార్లు అలెర్జీలు గొంతు నొప్పి, మంటను కలిగిస్తాయి. ఇది దుమ్ము, మట్టి లేదా ఆహార అలెర్జీల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ పరిస్థితిలో పరిస్థితి మరింత దిగజారవచ్చు. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సహాయం తప్పక తీసుకోవాలి.
యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో దీర్ఘకాలిక కడుపు సమస్యలు వస్తాయి. దీంతో కడుపులోని ఆమ్లం కారణంగా గొంతు నొప్పికి కారణమవుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న వారిలో ఇది తరచుగా నొప్పిని కలిగిస్తుంది. గొంతు నొప్పిని వదిలించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం.