Smartphone Addiction: మీ పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆ సమస్యలు తథ్యమంటున్న వైద్య నిపుణులు

|

Aug 05, 2021 | 1:35 PM

Smartphone Addiction: చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్‌ను అతిగా వాడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Smartphone Addiction: మీ పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆ సమస్యలు తథ్యమంటున్న వైద్య నిపుణులు
Follow us on

Smartphone Addiction in Kids: ఈ కంప్యూటర్ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని మనిషి లేడు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. కానీ స్మార్ట్ ఫోన్‌ని మంచి కన్నా, చెడుకే ఎక్కువ వాడుతున్నారు అన్నది నిపుణుల మాట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాదని అనలేం. స్మార్ట్ ఫోన్లో గేమ్స్, వీడియోస్, సోసియల్ మీడియా కోసం గంటల తరబడి వాడుతూనే ఉన్నారు. అయితే ఏడాది పిల్లలు అస్సలు ఫోన్ వాడకూడదని సైకియార్టిస్, కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  చిన్నప్పటి నుంచే ఫోన్ వాడటం మొదలు పెడితే పెద్దయ్యాక ఫోన్ కి బానిస అవ్వడం ఖాయమంటున్నారు చిన్న పిల్లల మానసిక వైద్యులు. మొదట్లో పిల్లలు మారం చేస్తున్నారనో? తినడం లేదనో? వారి చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తుంటారు. ఆ తర్వాత అదే వారికి అలవాటుగా మారిపోతుంది. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లో గడిపేందుకు వారు ఇష్టపడుతారు. అయితే ఇలా చేయడం చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేయడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు రోజుకి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఫోన్ వాడాలి. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలు రోజుకి 3 నుంచి 5 గంటలు స్మార్ట్ ఫోన్ వాడాలని, టీనేజర్స్ 5 నుంచి 6 గంటలు మాత్రమే వాడాలంటున్నారు పిడియాట్రిక్ డాక్టర్స్.

కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉదయాన లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు ఫోన్ తోనే సహవాసం చేస్తున్నారు. ఇలా అతిగా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ నర్స్ దెబ్బతింటాయని, మానసిక వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంటుందని సైకియార్టిస్ అంటున్నారు. డార్క్ రూమ్ లో స్క్రీన్ చూడటం వల్ల, ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మెల్ల కన్ను, కంటి సమస్యలు వస్తాయని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల మానసికంగానే కాదు శారీరక సమస్యలు కూడా వస్తాయని, తల్లిదండ్రులు బాధ్యత గా వహించి… పిల్లలను, టీనేజర్స్ ని ఫోన్ కి దూరంగా ఉండేలా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అతిగా ఫోన్ వాడటం మెంటలీ, ఫిజికలీ చాలా డేంజర్ అని అంటున్నారు.

(స్వప్నిక, టీవీ9 తెలుగు, హైదరాబాద్)

Also Read..

హాకీ టీం సభ్యులకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా.. ఎంత మంది పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే..

Prashant Kishor: పంజాబ్ అసెంబ్లీకి ముంచుకొస్తున్న ఎన్నికలు ..ప్రశాంత్ కిషోర్ షాకింగ్ నిర్ణయం