ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్‌లలో మునిగిపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ చాలా మందిని నిద్ర లేకుండా చేస్తోంది. రాత్రుల్లో కూడా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, మొబైళ్ల ముందు గడపడంతో నిద్రలేకుండా గడుపుతున్నారు. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఇలా రాత్రి ఎక్కువ సేపే మేలుకువతో ఉంటుండటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చాలా మందికి ఆర్థికపరమైన టెన్షన్స్, ఇతర కారణాల వల్ల రాత్రుల్లో నిద్ర పట్టదు. రాత్రి సమయాల్లో నిద్ర లేకుండా గడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇలా రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి త్వరగా నిద్ర రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూడటం తగ్గించాలి. అంటే మొబైల్స్ కానీ, కంప్యూటర్, ల్యాప్‌లాప్ మరేదైనా కావచ్చు. రాత్రి సమయాల్లో వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే రాత్రి నిద్రించే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. కానీ ఇలా రాత్రి సమయాల్లో అందరు స్నానం చేయకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు.
ఇక స్నానం చేయనివారు రాత్రి సమయాల్లో కాళ్లు కడుక్కోవాలి. ఆ తర్వాత కాళ్ళు కొంచెం చల్లగా ఉన్నప్పుడు కొబ్బరి నునే కొద్దిగా రాస్తే మంచిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్రించే గది శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. శుభ్రత అనేది నిద్రపోయేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో వాడే దుస్తులు సైతం రోజు మారుస్తూ ఉండాలి. పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు మొబైళ్లను చూడవద్దు. వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి విషయాలు పాటించినట్లయితే రాత్రి సమయాల్లో త్వరగా నిద్ర వస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి