Sleeping Position: రోజూ బోర్లా పడుకుంటున్నారా..? అయితే మీరు సమస్యల బారిన పడుతున్నట్లే.. ఎందుకంటే..

|

Aug 04, 2022 | 1:57 PM

సరైన పొజిషన్‌లో నిద్రించకపోతే కూడా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా అనిపించదు. నిద్రపోయే సమయంలో చాలామంది పలు రకాల పొజిషన్లలో నిద్రపోతుంటారు. కొంతమంది వెల్లకిలా నిద్రపోతారు

Sleeping Position: రోజూ బోర్లా పడుకుంటున్నారా..? అయితే మీరు సమస్యల బారిన పడుతున్నట్లే.. ఎందుకంటే..
Sleeping Position
Follow us on

Sleeping on Your Stomach: ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన జీవనశైలి కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే.. నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన దిశలో నిద్రించకపోతే.. పలు సమస్యలు వస్తాయంటున్నారు. అలా కాకుండా రోజూ 8 గంటలపాటు నిద్రపోయినా.. సరైన పొజిషన్‌లో నిద్రించకపోతే కూడా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా అనిపించదు. నిద్రపోయే సమయంలో చాలామంది పలు రకాల పొజిషన్లలో నిద్రపోతుంటారు. కొంతమంది వెల్లకిలా నిద్రపోతారు, మరికొందరు పక్కకి తిరిగి, ఇంకొందరు బోర్లాగా పడుకుంటారు. చాలా మంది ఉదరంపైనే బోర్లా నిద్రపోతారు. అలా కడుపుపై నిద్రపోవడం వల్ల మన శరీరానికి చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి..

బోర్లా ఎందుకు నిద్రపోకూడదో తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి
  • మనం ఉదరంపై నిద్రపోవడం వల్ల అది మన మెడపై ప్రభావం చూపుతుంది. ఇది కాస్త మెడ నొప్పి సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే కడుపుపై​నిద్రిస్తున్నప్పుడు మెడను కుడి లేదా ఎడమ వైపునకు తిప్పాలి. దీని కారణంగా మెడ నిటారుగా ఉండదు.
  • పొట్టపై పడుకొని నిద్ర లేవగానే బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం మొత్తం బరువు కడుపుపైనే ఉంటుంది.
  • కడుపు మీద పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. ఎందుకంటే బోర్లాగా పడుకున్నప్పుడు సరిగ్గా పడుకోలేరు. వీపు కొద్దిగా పైకి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సేపు అలా పడుకోవడం వల్ల వెన్ను నొప్పి కూడా వస్తుంది.
  • ఉదరంపై నిద్రపోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అందుకే నిటారుగా లేదా పక్కకు తిరిగి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత బోర్లాగా నిద్రపోకూడదు.
  • చిన్న పిల్లలు కూడా బోర్లాగా నిద్రపోకూడదని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లలు నిటారుగా నిద్రించడం వల్ల వారి శారీరక, మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఎత్తు కూడా వేగంగా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి