Covid vs Seasonal Fever: కరోనా వైరస్ లక్షణాలు.. సీజనల్ వ్యాధుల లక్షణాలకు మధ్య గల తేడా ఏమిటంటే..!
Covid vs Seasonal Fever: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపాటి తుమ్ము, దగ్గు వచ్చినా కరోనా అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజానికి కోవిడ్ నిర్ధారణ కోసం..
Covid vs Seasonal Fever: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపాటి తుమ్ము, దగ్గు వచ్చినా కరోనా అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజానికి కోవిడ్ నిర్ధారణ కోసం టెస్టులకు వెళ్లే వారిలో లక్షణాలు ఉన్నవారికంటే.. తమకు కరోనా ఉన్నదేమో అన్న అనుమానంతో వెళ్లేవారు ఎక్కువ. అలా వెళ్లి కరోనా వైరస్ బాధితుల గురించి వింటూనే ఉన్నాం.. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ 19 లక్షణాలు, సీజనల్ వ్యాధుల గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
కరోనా వైరస్ సోకినా వారిలో కనిపించే లక్షణాలు.. తీవ్రజ్వరం ఉంటుంది.. ఈ జ్వరం మూడు రోజులైనా తగ్గదు. జలుబు ఉంటుంది కానీ ముక్కు కారదు. పొడి దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలియదు. ఒళ్లంతా నొప్పులు తీవ్రంగా ఉంటాయి. విపరీతమైన తలనొప్పి ఉంటుంది. గొంతు నొప్పి,ఛాతి నొప్పి ఉంటుంది. కండ్లు ఎర్రబడుతాయి. వాంతులు,విరేచనాలు కూడా అవుతుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కరోనా పరీక్షలు చేయించుకొని మెరుగైన చికిత్స ను పొందాలి.
ఇక కాలానుగుణంగా వచ్చే సీజనల్ జ్వర లక్షణాల్లో ముఖ్యంగా సాధారణమైన జ్వరం ఉంటుంది. మూడు రోజుల్లోనే తగ్గుతుంది. ముక్కు కారుతుతంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలుస్తుంది. ఒళ్లునొప్పి,తలనొప్పి మామూలుగా ఉంటుంది. గొంతు నొప్పి ఉంటుంది. ఛాతిలో నొప్పి ఉండదు. వాంతులు,విరేచనాలు ఉంటాయి. కండ్లు ఎర్రబడవు.
అయితే కరోనా లక్షణాలు,సీజనల్ లక్షణాలు చాలావరకూ దగ్గరగా అనిపిస్తాయి. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఎవరికీ ఏ విధమైన అస్వస్థత అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల సలహాలను తీసుకోవాలి.
Also Read: కరోనాను జయించిన మొదటి దేశం… మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన