అందంగా కనిపించడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి? అందులోనూ అమ్మాయిలు.. అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. సహజ ఉత్పత్తులతో పాటు మార్కెట్‌లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కూడా వాడుతుంటారు. ఇక అమ్మాయిల అందంలో పెదవులదికీలక పాత్ర. అదరాలు గులాబీ రేకుల్లా అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ లిప్‌స్టిక్‌లన్నింటిలో ఉండే కెమికల్స్‌తో శరీరానికి చాలా నష్టం వాటిల్లుతుందంటున్నారు నిపుణులు. పెదవులు నిర్జీవమై కళా విహీనంగా మారిపోతాయాని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని పరిశోధనలు, అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, లిప్‌స్టిక్‌లో రంగును తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం విరివిగా ఉంటాయి. ఇలాంటి రసాయనాలుండే లిప్ స్టిక్ వాడటం వల్ల కూడా అలెర్జీ సమస్యలు వస్తాయంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. ఒక పరిశోధన ప్రకారం, పెదవులకు అప్లై చేసే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో చాలా కెమికల్స్ వాడుతున్నారు. ఈ రసాయనాల్లో సీసం కూడా ఉంది. పెదవులపై లిప్ స్టిక్ వల్ల నోటి ద్వారా పొట్టలోకి సీసం చేరుతుంది. ఇది ఉదర సంబంధింత సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఈ నేపథ్యంలో కెమికల్స్ నుంచి పెదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మార్కెట్‌లో దొరికే లిప్‌స్టిక్‌ల బదులు సహజ సిద్ధంగా రెడ్ కలర్ పువ్వులతో తయారు చేసుకున్న కలర్ పెదలకు వాడొచ్చు. అలాగే లిప్‌స్టిక్ రాసుకునే ముందు పెదాలపై ప్రైమర్ కానీ, ఫౌండేషన్ కానీ కన్సీలర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇది పెదవులు, లిప్ స్టిక్ మధ్య ఒక పొర లాగా ఉండి లిప్ స్టిక్ దుష్ప్రభావాల నుండి రక్షిస్తుంది. లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి ఉపయోగించే సీసం కారణంగా మహిళల్లో గర్భధారణ సమస్యలు తలెత్తవచ్చు. గర్భిణీలతో పాటు ఆమె కడుపులోని పిండానికి హాని కలిగిస్తుంది. ఇక రక్తంలో సీసం స్థాయులు పెరిగితే మెదడుకు చాలా ప్రమాదమంటున్నారు నిపుణుల. బుద్ధి మాంద్యంతో పాటు మానసిక రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇక్ లెడ్ కెమికల్ నాడీవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. వంధత్వం, హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు శారీర ఎదుగుదల కూడా ఆగిపోతుందట. చర్మం ఇరిటేట్ అవడం, శ్వాసలో ఆటంకం కలిగి గురక వస్తుందట. లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి
అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.