Sugar Side Effects: పంచదార ఎక్కువగా తింటున్నారా..? అయితే మీ శరీరం ప్రమాదంలో పడినట్లే..

|

Aug 07, 2022 | 10:01 AM

ముఖ్యంగా ఎంత మోతాదులో చెక్కర తీసుకుంటున్నామనే విషయంపై శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం..

Sugar Side Effects: పంచదార ఎక్కువగా తింటున్నారా..? అయితే మీ శరీరం ప్రమాదంలో పడినట్లే..
Sugar Side Effects
Follow us on

Diseases Caused by sugar: చక్కెరను అన్ని రకాల తీపి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో కంపెనీలు ప్యాకేజింగ్ ఫుడ్స్‌ను తయారు చేయడానికి పంచదారను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ప్రతి వ్యక్తి రోజూ చక్కెరను తీసుకునే దానికంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి చాలామంది ప్యాకేజింగ్ పానీయాలు, ఆహారాలను తీసుకుంటారు. అయితే.. ముఖ్యంగా ఎంత మోతాదులో చెక్కర తీసుకుంటున్నామనే విషయంపై శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. ఎందుకంటే నేటికాలంలో తీవ్రమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శక్తిలో మార్పు..

శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని ఉంచడం చాలా ముఖ్యం. మీరు తీపి పదార్థాలను తిన్నప్పుడల్లా అది కడుపు కణాలలోకి వెళ్లి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ తీపి పదార్థాలు తిన్నప్పుడు అది అధిక నిద్ర లేదా త్వరగా అలసటకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ముఖం మీద దుష్ప్రభావాలు..

చక్కెరను ఎక్కువగా తిన్నప్పుడల్లా, అది మీ ముఖంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మొటిమల సమస్యలు మొదలవుతాయి. కావున పురాతన కాలంలో ప్రజలు గాయాలు లేదా అనారోగ్య సమయంలో తీపి పదార్థాలను తినడానికి నిరాకరించేవారు. ఎందుకంటే దీని కారణంగా ఇన్సులిన్ నూనెను పెంచుతుంది. చర్మంలోని గ్రంథులు, గాయం నయం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. ఇంకా మోటిమలు సమస్యకు దారితీస్తుంది.

బరువు పెరుగుతోంది..

తరచుగా జిమ్‌కి వెళ్లే వ్యక్తులు చక్కెర వినియోగానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే దీని వినియోగం వల్ల నడుముకు రెండు వైపులా కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా పొట్ట కూడా బాగా పెరుగుతుంది. శరీర బరువు కూడా వేగంగా పెరగుతుంది. అందుకే ఎక్కువ చక్కెర తీసుకోవడం మానుకోండి.

తరచుగా జలుబు..

చాలామంది సమయాన్ని ఆదా చేయడానికి తరచుగా ప్యాకేజింగ్ ఆహారాలను ఉపయోగిస్తారు. బిస్కెట్లు, జ్యూస్‌లు, ఫ్రూటీలు, కేకులు వంటి ప్రతి ప్యాకేజింగ్ ఫుడ్‌లో చాలా చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో చెడు ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. దీని కారణంగా మీకు వైరల్ ఫీవర్, ఫ్లూ సమస్యలు మొదలవుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి