Sickle Cell Anemia: తలసేమియా వ్యాధి అంటే ఏంటో తెలుసా..? చికిత్సే లేని ఈ వ్యాధిని ఎలా తగ్గిస్తారు..?
ఈ సమస్యతో ఎక్కువగా గిరిజనులు మాత్రమే బాధపడతారు. అయితే వీరి రక్షణకు 0-40 ఏళ్ల మధ్య ఉన్న 7 కోట్ల మంది గిరిజనులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో 2047 నాటికి తలసేమియా (సికిల్ సెల్ అనిమియా) తగ్గించే విధంగా ప్రణాళిక రచిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అసలు సికిల్ సెల్ అనిమియా అంటే ఏంటి? ఏకంగా కేంద్రం దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు ఎందుకు తీసుకుంటుంది. నిజంగా ఆ వ్యాధి అంత ప్రమాదకరమా? అంటే నిజమే అంటున్నారు వైద్య నిపుణులు. సికిల్ సెల్ అనగా తలసేమియా వ్యాధి. ముఖ్యంగా ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత అని పేర్కొంటున్నారు. అయితే ఈ వ్యాధికి చికిత్స లేదని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. ఈ సమస్యతో ఎక్కువగా గిరిజనులు మాత్రమే బాధపడతారు. అయితే వీరి రక్షణకు 0-40 ఏళ్ల మధ్య ఉన్న 7 కోట్ల మంది గిరిజనులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే సార్వత్రిక పరీక్షలు కూడా నిర్వహిస్తామని వివరించారు.
తలసేమియా అంటే ఏంటి?
సికిల్ సెల్ వ్యాధిగా పిలిచే ఈ వ్యాధి రక్త రుగ్మతల్లో ఓ భాగం. ఈ ఇన్ ఫెక్షన్ వస్తే ఆర్ బీసీలను రౌండ్ ఫ్లెక్సిబుల్ డిస్క్ ల నుంచి గట్టి, జిగటుగా ఇంచుమించు కొడవలి ఆకారంలో కణాలను మారుస్తుంది. దీంతో శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉండవు. అలాగే ఈ ఇన్ ఫెక్షన్ వచ్చిన వ్యక్తి రక్త హీనతతో బాధపడతాడు. శరీరం కణజాలకు తగినంత ఆక్సిజన్ తీసుకెళ్లలేనప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సికిల్ సెల్ అనిమియాతో పుట్టిన పిల్లలకు చాలా రోజుల వరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని రోజుల తర్వాత మాత్రం చిన్న పనులకే అలసిపోవడం, కాళ్లు, చేతుల వాపు, కామెర్లు వంటి వ్యాధులతో తరచూ బాధపడుతుంటారు.
సికిల్ సెల్ అనిమియా లక్షణాలు
ఈ వ్యాధి ప్రధాన లక్షణం రక్త హీనత. ముఖ్యంగా శరీరంలో ఎర్ర రక్త కణాలు 10 నుంచి 20 రోజుల్లో చనిపోతాయి. తిరిగి శరీరం రక్త కణాలను వృద్ధి చేయడానికి 120 రోజులు పడుతుంది. దీంతో రక్త హీనతకు గురవుతారు. చాతి, పొత్తికడుపు, కీళ్లల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కోల్పోతుంది. దీంతో అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో ఎదుగుదలలో ఆలస్యం, అలాగే ఒక్కోసారి త్వరగా యుక్త వయస్సుకు వచ్చేయవచ్చు.
చికిత్స
సికిల్ సెల్ అనిమియాకు చికిత్స లేదు. అయితే స్టెమ్ సెల్, బోన్ మేరో చికిత్సలతో వ్యాధిని నయం చేసే అవకాశం ఉంది. కానీ ఈ చికిత్స చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణుల అభిప్రాయం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం