షవర్ కింద స్నానం చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ప్రతిరోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంలో ఉంచుతుంది. తలపై నేరుగా నీళ్లు పోయకుండా కాళ్ల నుండి మొదలుపెట్టి స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సరైన సమయాన స్నానం చేస్తే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

ప్రస్తుత రోజుల్లో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి పనులు మొదలు పెట్టడం మనకు అలవాటైపోయింది. కానీ నిజంగా ఎందుకు స్నానం చేస్తామో చాలా మందికి తెలియకపోవచ్చు. బయట పడే చెమట, ధూళి, మురికిని శుభ్రం చేయడమే కాదు.. శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా స్నానం చాలా అవసరం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సహజ ప్రక్రియ.
మన తాతల కాలంలో నదులు, చెరువులు, బావులు లాంటి వాటిలో స్నానం చేయడం ఒక సంప్రదాయం. కాళ్లను తాకే చల్లటి నీళ్లు పైకి వెళ్తూ శరీరంలో ఉన్న వేడిని మెల్లగా తల, ముఖం ద్వారా బయటకు పంపిస్తాయి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా సమతుల్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా చక్కగా జరిగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ రోజుల్లో షవర్ వాడడం కామన్ అయిపోయింది. కానీ షవర్ తో స్నానం చేసే పద్ధతిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా పాటించాలి. తలపై నేరుగా నీళ్లు పోయకుండా ముందుగా కాళ్లపై నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత మోకాళ్లు, మెడ భాగం, తర్వాతే తలపై నీళ్లు పోసుకోవాలి. ఈ సీక్వెన్స్ వల్ల శరీరం వేడి మార్పును సమతుల్యంగా ఎదుర్కొంటుంది. ఆరోగ్యానికి మంచిది.
ఉదయం స్నానం చేయడం శరీరానికి శక్తిని ఇచ్చి.. మనసుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే కొంత మందికి రాత్రి స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది. నిపుణుల మాటల ప్రకారం.. రాత్రి కంటే సాయంత్రం 5 నుండి 6:30 మధ్య స్నానం చేయడం శరీరానికి ఉత్తమంగా ఉంటుందని చెబుతారు. ఇది అలసటను తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది.
ఒకవేళ మీరు రాత్రి స్నానం చేయాలనుకుంటే.. ఖాళీ పొట్టతో స్నానం చేయకూడదు. తిన్న తర్వాత కొంత సమయం తీసుకుని.. ఆ తర్వాతే స్నానం చేయాలి. అలాగే శరీరాన్ని బాగా తుడిచేయడం అవసరం. లేకపోతే శరీరంపై తడి ఉండటం వాత సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




