AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్ డేంజర్ బెల్స్.. ఫ్యాటీ లివర్ లక్షణాలు, పరిష్కారాలు ఇవే..! నిర్లక్ష్యం చేయొద్దు..!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఫ్యాటీ లివర్ అనే సమస్య వస్తోంది. అంటే లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అన్నమాట. మొదట్లో దీని లక్షణాలు పెద్దగా తెలీవు.. కానీ నెమ్మదిగా ఇది పెద్ద జబ్బుగా మారొచ్చు. అయితే కంగారు పడనవసరం లేదు. సరైన ఆహారం తింటూ, వ్యాయామం చేస్తూ, జీవనశైలిని మార్చుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముందే జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదాలు రాకుండా చూసుకోవచ్చు.

లివర్ డేంజర్ బెల్స్.. ఫ్యాటీ లివర్ లక్షణాలు, పరిష్కారాలు ఇవే..! నిర్లక్ష్యం చేయొద్దు..!
Fatty Liver Issues
Prashanthi V
|

Updated on: Jul 26, 2025 | 8:17 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది స్టార్టింగ్‌ లో ఎలాంటి లక్షణాలు చూపించకుండా నెమ్మదిగా లోపలి నుంచి సమస్యను పెంచుతుంది. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి.. సరైన ఆహారం, వ్యాయామం, లైఫ్‌ స్టైల్‌ లో మార్పులతో దీన్ని తగ్గించవచ్చు.

ఫ్యాటీ లివర్ అంటే ఏంటి..?

శరీర బరువు ఎక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల లివర్ చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది

  • మద్యం తాగడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్
  • మద్యం లేకుండానే ఏర్పడే ఫ్యాటీ లివర్ (NAFLD)

దీన్ని తొలి దశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా ఉండొచ్చు. లేకపోతే ఇది ముదిరి లివర్ సిరోసిస్ లేదా క్యాన్సర్ లాంటి ప్రమాదాలను కలిగించవచ్చు.

బరువును కంట్రోల్ చేయండి

ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రత్యేకంగా మందులు లేకపోయినా.. జీవనశైలి మార్పుల ద్వారానే దీన్ని మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడం చాలా అవసరం. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు లివర్‌ పై బాగా ప్రభావం చూపుతుంది. తొందరగా బరువు తగ్గాలని హడావిడి పడొద్దు. నెమ్మదిగా, హెల్తీ మార్గాల్లో బరువు తగ్గాలి. ఒక్కసారిగా తగ్గడం వల్ల మరింత సమస్యలు రావొచ్చు.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ ను దూరంగా పెట్టండి

ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లు శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ చక్కెర, ఎక్కువ కొవ్వు ఉన్న ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు పూర్తిగా మానేయాలి. వాటికి బదులుగా..

  • పాలు, పెరుగు, పప్పులు, తాజా కూరగాయలు
  • నట్స్, పండ్లు
  • ఒమేగా 3 ఉన్న చేపలు
  • హోల్ గ్రైన్స్ (వీటితో చేసిన బ్రెడ్, రొట్టెలు)
  • యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు
  • ఇవన్నీ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారం, స్వీట్లు, డ్రింక్స్, జంక్ ఫుడ్‌ ను పూర్తిగా వదిలేయాలి.

వ్యాయామం చాలా ముఖ్యం

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అవసరం. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు లివర్‌ కు మంచి చేస్తాయి. వారానికి 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల మోస్తరు శారీరక శ్రమ అవసరం. మద్యం పూర్తిగా మానేయడం ఫ్యాటీ లివర్ చికిత్సకు కీలకం.

షుగర్ కంట్రోల్‌ కు జాగ్రత్తలు

డయాబెటిస్ ఉన్నవాళ్లు తమ బ్లడ్ షుగర్‌ ను నియంత్రణలో ఉంచడం తప్పనిసరి. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లలో హై ట్రైగ్లిసరైడ్స్, అధిక LDL కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉండవచ్చు. ప్రతి ఆరు నెలలకొకసారి టెస్టులు చేయించుకోవాలి. అవసరమైన మోతాదులో మందులు తీసుకుంటూ డైట్ పాటించాలి.

ఒకే రోజులో ట్రీట్‌మెంట్ సాధ్యం కాదు

ఫ్యాటీ లివర్ ట్రీట్‌ మెంట్ అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. దీన్ని దశలవారీగా, క్రమశిక్షణతో పోగొట్టాలి. శరీర బరువు తగ్గించడం, హెల్తీ ఆహారం తీసుకోవడం, రోజువారీ వ్యాయామం చేయడం, చెడు అలవాట్లు వదిలేయడం లాంటివి పాటించాలి. మీకు ఈ సమస్య ఉందని అనిపిస్తే లేట్ చేయకుండా డాక్టర్‌ను కలిసి సరైన సలహా తీసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)