
వేసవి కాలం, వర్షా కాలం కంటే.. శీతా కాలం డిఫెరెంట్. ఈ సీజన్ లో శరీరక పరంగా, చర్మం పరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. పొడి బారడం, నిర్జీవంగా ఉండటం, పగలడం, దురదలు, అలెర్జీ వంటి సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది లోషన్లు వాడుతూ ఉంటారు. అందులో సన్ స్క్రీన్ కూడా ఒకటి. చాలా మంది కేవలం బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేయాలని అంటారు. మరి కొంత మంది శీతా కాలంలో సన్ స్క్రీన్ అవసరం లేదని చెబుతారు. మరి సన్ స్క్రీన్ ఎప్పుడు రాసుకోవాలి? శీతా కాలంలో రాసుకుంటే మంచిదేనా.. ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని ఎక్కువగా ఎండకు బహిర్గతం చేయడం వల్ల అకాలంగా చర్మం దెబ్బ తింటుందని, వృద్ధాప్యం వస్తుందని, అంతే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు సూచించారు. మీరు బయట ఉన్నా లేక పోయినా.. సన్ స్క్రీన్ ని అప్లై చేయడం వలన మీ చర్మానికి పోషణ అందడమే కాకుండా.. రక్షణగా కూడా ఉంటుంది.
సన్ స్క్రీన్ అప్లై చేయడానికి సీజన్ లతో సంబంధం లేదని.. దినచర్యలో దీన్ని కూడా ఒక భాగం చేసుకోవాలని చర్మ నిపఉనులు చెబుతున్నారు. సూర్య రశ్మికి కారణం అయ్యే యూవీబీ కిరణాలు ఏడాది పొడవునా ఉంటాయని.. వీటికి ఎక్స్ పోజ్ అవడం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లను ఉపయోగించడం వల్ల యూవీ రేడియేషన్ ల నుండి రక్షించడంలో హెల్ప్ అవుతుంది.
మీరు బయట ఉన్నా లేక ఇంట్లోనే ఉన్నా సన్ స్క్రీన్ ని ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే సన్ స్క్రీన్ ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోవాలి, మీ హ్యాండ్ బ్యాగ్ లో సన్ స్క్రీన్ క్రీమ్ కి ప్లేస్ ఉంచాలని అంటున్నారు నిపుణులు. ఇది చర్మంలో పిగ్మెంటేషన్ లో కూడా సహాయ పడుతుంది. పిగ్మెంటేషన్ చర్మంపై ముదురు పాచెస్ గా కనిపిస్తాయి. సూర్య రశ్మికి అలాగే బయట దుమ్మూ, ధూళికి ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా వీటన్నింటి నుంచి మీ చర్మాన్ని కాపాడు కోవాలంటే.. తప్పకుండా ప్రతి రోజు సన్ స్క్రీన్ ను ఉపయోగించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.