Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! కానీ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారు ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్, డ్రింక్స్, నట్స్, సీడ్స్ లను తమ రోజువారీ డైట్ లో భాగంగా చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాల్లో ఒకటిగా నిలిచాయి. అయితే చియా సీడ్స్‌ను అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని అనర్థాలు కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

చియా సీడ్స్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! కానీ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
Untitled Design (78)
Follow us
Prashanthi V

|

Updated on: Jan 27, 2025 | 2:36 PM

ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టే వారు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు, డ్రింక్స్, నట్స్, సీడ్స్ తమ రోజువారీ ఆహారంలో చేర్చడం గురించి ఆలోచిస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చియా సీడ్స్ ని తింటున్నారు. అయితే చియా సీడ్స్ ను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో.. అలాగే కొన్ని అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉందట. చియా సీడ్స్ ను ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు

చియా సీడ్స్ లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ క్రియకు సహాయపడినా.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చియా సీడ్స్ లను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగడం అవసరం. నీరు తక్కువగా తాగి ఎక్కువగా చియా సీడ్స్ ను తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

అలెర్జీకి అవకాశం

చియా సీడ్స్ అందరికీ అనుకూలంగా ఉండవు. కొందరికి వీటిని తీసుకున్న తర్వాత అలెర్జీ సమస్యలు ఎదురవుతాయి. చర్మం దురద, దద్దుర్లు రావడం, ముఖం వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చియా సీడ్స్ ను తినడం ఆపేయాలి.

రక్తంపై ప్రభావం

చియా సీడ్స్ లలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచబడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ రక్తానికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటున్నవారు లేదా రక్తపోటు మందులు వాడుతున్నవారు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని వైద్యుల సూచనతో ముందుగానే తెలుసుకోవడం మంచిది.

జాగ్రత్తలు తప్పనిసరి

కొందరు చియా సీడ్స్ లను నీటిలో నానబెట్టకుండా నేరుగా తింటారు. వీటిని సలాడ్‌లపై చల్లడం లేదా వేయించి తినడం వల్ల ఆహార నాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లేదా అన్నవాహిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి చియా సీడ్స్ లను సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా అవసరం.

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం

చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే కొందరికి వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్నవారు చియా సీడ్స్ లను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేవారు వీటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

చియా సీడ్స్ ను ఎలా తీసుకోవాలి..?

చియా సీడ్స్ లను నీటిలో కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. రోజు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే తినడం సరిపోతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం మంచిది. చియా సీడ్స్ శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. కానీ ఇవి లిమిటెడ్ గా తీసుకోకపోతే శరీరానికి హాని చేస్తాయి. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచనలతో వీటిని తీసుకోవడం మంచిది.