Pregnant Avoid Coffee: మహిళలు గర్భిణీలుగా ఉన్న సమంయలో కాఫీ ఎక్కువగా తాగితే పుట్టబొయే పిల్లలపై దుష్పప్రభావం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ఆధారంగా శాస్ర్తవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. రోజుకు సరాసరి సగం కప్పు కాఫీ తాగినా పుట్టబోయే పిల్లలకు ప్రమాదమేనని సూచిస్తున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా సుమారు రెండు వేలకిపైగా గర్భిణీలను పరిగణలోకి తీసుకొని పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం 8 నుంచి 13 వారాల గర్భిణీల రక్త నమూనాలను సేకరించి వారిలో కెఫైన్ మోతాదు ఎక్కువగా ఉన్న వారిని గుర్తించారు. ఇక వీరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అధ్యయనం చేపట్టి.. కెఫైన్ శాతం ఎక్కువగా ఉన్న మహిళలకు జన్మించిన చిన్నారులు మిగతా వారితో పోలిస్తే 84 గ్రాములు తక్కువ భరువుతో, తక్కువ పరిమాణంతో జన్మించారని గుర్తించారు. ఇక ఈ విషయంపై మరింత లోతుగా ప్రయోగాలు జరిపిన శాస్ర్తవేత్తలు.. తక్కువ భరువు, పరిమాణంతో జన్మించిన చిన్నారులకు భవిష్యత్తులో ఒబెసిటీ, గుండె సంబంధిత, డయాబెటిస్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. ప్రతీరోజు 50 మిల్లీ గ్రాముల కెఫైన్‌ను తీసుకునే వారికి జన్మించిన చిన్నారులు ఇతరులతో పోలిస్తే 66 గ్రాములు తక్కువ బరువుతో ఉంటారని తేలింది. అయితే తల్లి కాఫీ తాగితే పుట్టబోయే బిడ్డపై ఎందుకు ప్రభావం ఉంటుదన్న కోణంలో పరిశోధనలు జరిపిన పరిశోధకలు.. కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే, తల్లి నుంచి బిడ్డకు రక్త ప్రసరణపై ప్రభావం చూపుందని గుర్తించారు. అంతేకాకుండా కెఫైన్.. గర్భంలో ఉన్న చిన్నారుల స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు భవిష్యత్తులో వారి ఎదుగుదలపై దుష్పభావం ఉంటుందని కనుగొన్నారు. కాబట్టి గర్భీణీలు కెఫైన్‌కు ఎంత దూర ఉంటో అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Urvashi Rautela : అందాలందు ఊర్వశి అందాలే వేరయా.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రౌతేలా హాట్ పిక్స్..