AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Using Old Coolers: అటక మీదున్న కూలర్లను కిందికి దించే సమయం ఆసన్నమైంది.. మరి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.?

Precautions While Using Old Coolers: అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మార్చి నెల కూడా పూర్తికాకముందే భాను తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక పెరుగుతోన్న ఈ ఎండల నుంచి తట్టుకోవడానికి ఎక్కువ మంది..

Using Old Coolers: అటక మీదున్న కూలర్లను కిందికి దించే సమయం ఆసన్నమైంది.. మరి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.?
Things Todao While Using Old Coolers
Narender Vaitla
|

Updated on: Mar 30, 2021 | 8:14 PM

Share

Precautions While Using Old Coolers: అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మార్చి నెల కూడా పూర్తికాకముందే భాను తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక పెరుగుతోన్న ఈ ఎండల నుంచి తట్టుకోవడానికి ఎక్కువ మంది ఉపయోగించేవి కూలర్లు. కేవలం సమ్మర్‌లో మాత్రమే ఉపయోగపడే ఈ కూలర్లను మనలో చాలా మంది తర్వాతి సమయాల్లో ప్యాక్‌ చేసి అటక మీద పెట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎండలు మండి పోతుండడంతో వాటిని కిందికి దించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. మరి సుమారు ఎనిమిది నెలలపాటు నిరుపయోగంగా పడి ఉన్న కూలర్లను మళ్లీ వినియోగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం.. * చాలా కాలం పాటు మూలన పడి ఉన్న కారణంగా కూలర్లలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే ఉపయోగించకుండా ముందు శుభ్రం చేసుకోవాలి. * ఇక కూలర్‌లో పాత నీరు ఏమైనా ఉంటే పూర్తిగా తీసేయాలి. ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా పేరుకుపోవడం ద్వారా నిమోనియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. * ఇక కూలర్లలో ఉండే గడ్డిలో కూడా ఫంగస్‌ చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ప్రతీ ఏడాది గడ్డిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే.. గడ్డిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టిన తర్వా ఉపయోగించాలి. * మూలన పడి ఉన్న కూలర్స్‌లో ఎలుకలు వైర్లను కట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇది గమనించకుండా కూలర్‌ను ఉపయోగిస్తే షాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా కూలర్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఉపయోగించుకోవాలి. * ఇక కూలర్‌లోని నీటిని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉండాలి. లేదంటే పేరుకుపోయిన ఆ నీరు దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఉంటుంది.

Also Read: US Navy sing Hindi song : అమెరికా నేవీ హిందీ పాట ఆలపించిన అరుదైన సంఘటన, వైరల్ అవుతోన్న వీడియో

Car Coated With Cow Dung: వాట్‌ ఏ ఐడియా..! దంచికొడుతోన్న ఎండల నుంచి తన కారును ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి..

KFC India News : కేఎఫ్‌సీ చికెన్ అంటే యమ క్రేజీ..! కొత్తగా మరో 30 ఔట్‌లెట్లు ప్రారంభం.. ఎక్కడెక్కడో తెలుసా..?