Daytime Napping: పగటి పూట నిద్రపోవడం వల్ల డయాబెటిస్ వస్తుందా? నిర్లక్ష్యం వద్దు..
చాలా మందికి పగటిపూట ఏదో ఒక సమయంలో కాస్త నిద్రపోవడం సర్వసాధారణం. కానీ చాలా మంది గంటల తరబడి నిద్రపోతారు. కానీ ఈ అలవాటు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పగటిపూట నిద్రపోయే అలవాటు వల్ల ఎన్నో సమస్యలు..

నేటి వేగవంతమైన జీవనశైలిలో విశ్రాంతి తీసుకోవడానికి సమయమే దొరకడం లేదు. దీంతో చాలా మంది పగటిపూట ఏదో ఒక సమయంలో కాస్త నిద్రపోవడం సర్వసాధారణం. కానీ చాలా మంది గంటల తరబడి నిద్రపోతారు. కానీ ఈ అలవాటు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పగటిపూట నిద్రపోయే అలవాటు వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు వాస్తవమో తెలుసుకోవడానికి పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. కాబట్టి పగటిపూట నిద్రపోవడం వల్ల నిజంగా మధుమేహం వస్తుందో? లేదో? ఇక్కడ తెలుసుకుందాం..
రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువసేపు పగటి పూట నిద్రపోవడం వల్ల డయాబెటిస్ వస్తుందా?
ఈ పరిశోధనలో మొత్తం 40 వేర్వేరు అధ్యయనాలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది వ్యక్తుల నుంచి వచ్చిన డేటా కూడా ఉంది. డేటా సేకరణ సమయంలో పాల్గొనేవారు పగటిపూట నిద్రపోతున్నారా? ఎంతసేపు నిద్రపోతున్నారు? అనే దానిని గమనించారు. ఈ సమాచారాన్ని వారి మధుమేహ స్థితి, రక్తంలో చక్కెర నియంత్రణతో పోల్చారు. 30 నిమిషాల కంటే ఎక్కువసేపు ముఖ్యంగా 1 గంట లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోతున్న వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వీరి పరిశోధన వెల్లడించింది.
సాధారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల శరీర సహజ గడియారం దెబ్బతింటుంది. ఇది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు పగటిపూట నిద్రపోవడం రాత్రిపూట నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకం. పగటిపూట నిద్రపోవడం పర్వాలేదు. అయితే మీరు సమయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఒకవేళ పగటి పూట నిద్రపోతే దానిని 20 నుంచి 30 నిమిషాలకు పరిమితం చేయడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




