Stroke: స్ట్రోక్‌తో మరో పాతికేళ్లకు 10 మిలియన్ల మరణాలు.. భారతీయులకు హెచ్చరిక!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్‌ మరణాలు మన దేశంలో పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి జనాభాల్లో 10 మిలియన్ల జనాలు ఈ మహమ్మారికి బలి కావల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Stroke: స్ట్రోక్‌తో మరో పాతికేళ్లకు 10 మిలియన్ల మరణాలు.. భారతీయులకు హెచ్చరిక!
Stroke

Updated on: Dec 01, 2024 | 1:06 PM

ఇటీవలి కాలంలో భారత్‌తో పాటు పలు దేశాల్లో స్ట్రోక్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. 2050 నాటికి మన దేశంలో 10 మిలియన్ల మరణాలు కార్డియాక్‌ అరెస్ట్, స్ట్రోక్‌తో దారితీస్తుందట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో నిర్వహించిన లాన్సెట్ మెడికల్ జర్నల్ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. ఇది 2050 నాటికి 9.7 మిలియన్లకు పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. కాబట్టి స్ట్రోక్‌కు సంబంధించిన విషయాలపై అవగాహన అవసరం. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, నిశ్చల జీవనశైలి వంటి కొన్ని ప్రమాద కారకాలు స్ట్రోక్‌కు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

డా. నిర్మల్ సూర్య ఏం చెబుతున్నారంటే.. ‘స్ట్రోక్ అనేది ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపించే అత్యంత ప్రమాదకర పరిస్థితి. మెదడులోని భాగాలకు రక్త ప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు. ఇది పెద్ద ఆరోగ్య సమస్యలతో పాటు మెదడుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం వంటి అనేక రూపాల్లో నికోటిన్ తీసుకునే వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. అందుకే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆయన చెబుతున్నారు. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఈ కింది జీవనశైలి మార్పులు చాలా అవసరం. అవేంటంటే..

రక్తపోటు నియంత్రించడం

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది స్ట్రోక్‌ ప్రమాద కారకాల్లో ఒకటి. కాబట్టి రక్తపోటు స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. ప్యాక్ చేసిన లేదా జంక్ ఫుడ్స్ వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలను పూర్తిగా నివారించాలి.

ఇవి కూడా చదవండి

నికోటిన్ తీసుకోవడం మానుకోవాలి

ధూమపానం వంటి అనారోగ్య అలవాట్లు స్ట్రోక్ వంటి సమస్యను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇది మీ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా ధమనులలో ఫలకం అధికంగా ఏర్పడుతుంది. కాబట్టి స్మోకింగ్ మానేయడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం

మధుమేహం వంటి ఆరోగ్య పరిస్థితులు స్ట్రోక్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా తీసుకోవాలి. వీటన్నింటితో పాటు సమతులాహారం తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారు. ఈ విధంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

తగినంత పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్ళు, గింజలు, లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోవాలి. లేకపోతే ఈ పదార్ధాలన్నీ కలిసి హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

శారీరకంగా చురుకుగా ఉండటం అనేది మీ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి, మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, జిమ్, కార్డియో, యోగా, మెడిటేషన్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్‌తో సహా ఏదైనా ఒక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.