AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Complications: ఈ 4 వ్యాధులున్న స్త్రీలు పొరపాటున కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకండి.. నిపుణుల సలహా ఏమిటంటే..

పెళ్లి అయిన ప్రతి స్త్రీ మాతృత్వం కోసం కలలు కంటుంది. అయితే మహిళకు ఈ నాలుగు వ్యాధులు ఉంటే.. అప్పుడు పొరపాటున కూడా శిశువు కోసం ప్లాన్ చేయకండి. అలా చేయడం వలన తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదం ఏర్పడుతుంది. గర్భం ప్లాన్ చేయడానికి ముందు చాలా విషయాలు గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికీ ఏ వ్యాధులు ఉంటె శిశువును ప్లాన్ చేయకూడదో తెలుసుకోవాలి. ఈ వ్యాధులున్న స్త్రీలు బిడ్డను కలిగి ఉండాలని ప్లాన్ చేస్తే.. అప్పుడు తల్లి బిడ్డ ఇద్దరి జీవితం ప్రమాదంలో పడవచ్చు. ఆ వ్యాధులు ఏమిటో తెలుసుకుందాం..

Pregnancy Complications: ఈ 4 వ్యాధులున్న స్త్రీలు పొరపాటున కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకండి.. నిపుణుల సలహా ఏమిటంటే..
అయితే పాలకూర చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త కణాల తయారీలో సహాయపడుతుంది. సాధారణంగా గర్భిణీలు చలి కాలంలో చేపలను ఎక్కువగా తినాలి. చేపలు తినడం ద్వారా పిల్లల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. Image Credit source: gettyimages
Surya Kala
|

Updated on: Oct 20, 2024 | 5:26 PM

Share

పెళ్లయ్యాక ప్రతి స్త్రీ తన ఇంటిలో చిన్నారి రావాలని కోరుకుంటుంది. అయితే కొన్ని వ్యాధులున్న స్త్రీలు పొరపాటున కూడా గర్భధారణను ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాధులున్నవారు శిశువును ప్లాన్ చేయడం తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కొన్ని రకాల వ్యాధులున్నవారు పిల్లలను కనకూడదని లేదా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాతనే ఈ విషయం గురించి ఆలోచించాలని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల ద్వారా ఆ 4 వ్యాధులు ఏమిటో తెలుసుకోండి. ఈ వ్యాధులు ఉంటే బిడ్డను ప్లాన్ చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఢిల్లీలోని GTB హాస్పిటల్‌లోని గైనకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ మంజు వర్మ మాట్లాడుతూ ఏ మహిళకైనా గుండె జబ్బు ఉంటే.. అంటే స్త్రీ గుండె బలహీనంగా ఉన్నా.. లేదా గుండె జబ్బులు లేదా గుండె స్పందనలో హెచ్చతగ్గులున్నా , లేదా మహిళ కార్డియోవాస్కులర్ వ్యాధి చివరి దశలో ఉన్నట్లయితే.. అటువంటి స్త్రీలు గర్భం ధరించరాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ దశలో గుండె చాలా బలహీనంగా ఉంటుంది. మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఏ పనీ సక్రమంగా చేయలేరు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వ్యాధులున్న స్త్రీలు పిల్లల కోసం ప్లాన్ చేస్తే.. అప్పుడు తల్లి, బిడ్డ ఇద్దరి జీవితం ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు.

TB వ్యాధి TBతో బాధపడే మహిళలు ఈ కాలంలో పిల్లల కోసం ప్లాన్ చేయకూడదు. టీబీ నయమైన తర్వాతే పిల్లల కోసం ఆలోచించాలి. ఎందుకంటే టీబీ ఉంటే అది తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. ముందుగా టీబీకి పూర్తి చికిత్స చేయించుకుని ఆ తర్వాతే గర్భధారణ గురించి ఆలోచించమని డాక్టర్ మంజు చెప్పారు.

ఇవి కూడా చదవండి

HIVతో బాధపడే మహిళలు TB వ్యాధి వలనే HIVతో బాధపడే స్త్రీలు కూడా గర్భధారణ గురించి ఆలోచించవద్దు అని అంటున్నారు. ఒకవేళ HIV బాధిత స్త్రీలు పిల్లల గురించి ప్లాన్ చేస్తే.. ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

తీవ్రమైన మూత్రపిండ వ్యాధి సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని గైనకాలజీ విభాగంలో డాక్టర్ సలోని ఈ విషయంపై మాట్లాడుతూ తీవ్రమైన మూత్రపిండ వ్యాధితో బాధపడే స్త్రీలు.. ముఖ్యంగా డయాలసిస్‌ చేయించుకునే స్త్రీలు పిల్లల కోసం ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే కిడ్నీ వ్యాధి పిల్లలకు సంక్రమణకు కారణమవుతుంది. ఇది పిల్లలకి ప్రమాదకరం. ఏ స్త్రీకైనా డయాలసిస్ తీసుకోవడం ముగిసినా.. లేదా ఆమెకు మూత్రపిండ మార్పిడి జరిగినా ఆమె కనీసం మూడు సంవత్సరాల తర్వాత బిడ్డ కోసం ప్లాన్ చేయాలి. అయితే పిల్లల కోసం ఆ మహిళలు మొదట వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..