Heart Attack: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా? గుండెపోటుకు సంకేతం కావొచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

|

Sep 28, 2022 | 4:59 PM

తీవ్ర పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణ కాలుష్యం.. ఇలా తదితర కారణాలతో చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. మధుమేహం, హైబీపీ, గుండెపోటు బాధితులుగా మారిపోతున్నారు.

Heart Attack: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా? గుండెపోటుకు సంకేతం కావొచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త
Heart Attack
Follow us on

తీవ్ర పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణ కాలుష్యం.. ఇలా తదితర కారణాలతో చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. మధుమేహం, హైబీపీ, గుండెపోటు బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉద్యోగాల్లో పడిపోయి ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు. అర్ధరాత్రిళ్ల వరకు మేల్కొంటున్నారు. ఇవన్నీ అనారోగ్యకరమైన జీవనశైలికి సంకేతం. వీటివల్ల భవిష్యత్‌లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాగా నేటి యువతలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్కోసారి ఆకస్మికంగా కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో శరీరంలో కనిపించే కొన్ని సంకేతాలను ముందుగానే పసిగట్టడం ద్వారా గుండెపోటు నుంచి జాగ్రత్త పడవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

వెన్నునొప్పి

మీరు శరీరంలో వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే మరియు ఈ సమస్య నిరంతరం కొనసాగితే, అది కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. వెన్నునొప్పి కారణంగా పనితీరు కూడా ప్రభావితమవుతుంది. మీకు తరచుగా వెన్నునొప్పి ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

ఛాతి నొప్పి

ఇది గుండెపోటుకు అతిపెద్ద సంకేతంగా పరిగణించవచ్చు. చాలామంది ఛాతీ నొప్పిని గ్యాస్ నొప్పిగా భావిస్తారు. నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఛాతీ నొప్పితో పాటు, విపరీతమైన భయం, చెమటలు పట్టడం కూడా గుండెపోటుకు ముందస్తు సంకేతాలు.

జీర్ణ సమస్యలు

కాగా ఆహారంలో పొరపాట్లు కారణంగా, జీర్ణవ్యవస్థ బలహీనపడటం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో అజీర్తి, గ్యాస్‌ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు నిరంతరం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు రోజూ వ్యాయామం చేయాలంటున్నారు.

వీటికి దూరంగా ఉండాల్సిందే..

సిగరెట్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే, ఈ రోజు నుంచే ఈ అలవాటును మానుకోవాలి. ఇది కాకుండా మార్కెట్‌లో దొరికే జంక్ ఫుడ్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. ఈ రకమైన ఆహారం ధమనులలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)