Pollution: 80 శాతం చిన్నారులు పొల్యూషన్ వల్లే మృతి.. పరిశోధనల్లో వైల్లడైన సంచలన నిజాలు..

అభివృద్ధి పేరుతో వాతావరణాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా..

Pollution: 80 శాతం చిన్నారులు పొల్యూషన్ వల్లే మృతి.. పరిశోధనల్లో వైల్లడైన సంచలన నిజాలు..
Pollution

Updated on: Oct 29, 2022 | 9:17 AM

అభివృద్ధి పేరుతో వాతావరణాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా అధ్యయనం. ఆఫ్రికాలో 80 శాతం పిల్లల మరణాలకు రెండు ప్రధాన కారణం వాయు కాలుష్యం అని తేల్చారు. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ దీనికి సంబంధించిన షాకింగ్ విషయాలు ప్రస్తావించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కాలుష్య ప్రభావం ఉందని, తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

1.2 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్న ఆఫ్రికా ఖండంలో ప్రధాన వాయు కాలుష్య మూలాలు, సంబంధిత ఆరోగ్య ప్రభావాలపై సమగ్ర విశ్లేషణను ఈ అధ్యయన నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం.. 2019లో, వాయు కాలుష్యం ఆఫ్రికాలో 1.1 మిలియన్ల మరణాలకు దోహదపడింది. 63 శాతం మరణాలు గృహ, వాయు కాలుష్యం (HAP)కి సంబంధం ఉందని పేర్కొన్నారు. వాయు కాలుష్యం కారణంగా హృదయ, శ్వాసకోశ, ఇతర వ్యాధుల సంభవించి మరణాలకు దారి తీస్తుందని అధ్యయనం పేర్కొంది.

నవజాత శిశువుపై కాలుష్య ప్రభావం..

దీర్ఘకాలిక పరిణామాలతో శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయి. 2019లో, ఆఫ్రికా అంతటా ఐదేళ్లలోపు పిల్లల మరణాలలో 14 శాతం వాయు కాలుష్యం కారణంగా తేలింది. పిల్లలు ఊపిరితిత్తుల అనారోగ్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అంటువ్యాధుల బారిన పడటం వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

నవజాత శిశువులు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు HAP కారణంగా తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలకు లోనవుతున్నారు. ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. దాదాపు 2,36,000 నవజాత శిశువులు వాయు కాలుష్యం కారణంగా మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్న అధ్యయనం.. వీరిలో 80 శాతం మంది HAP కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు పరిశోధనకారులు.

‘‘తూర్పు, పశ్చిమ, మధ్య, దక్షిణాఫ్రికాలోని జనాభాలో 75 శాతం మంది బొగ్గు, కలప, వంటి ఘన ఇంధనాలతో వంట చేస్తుంటారు. నివాసితులు ప్రతిరోజూ ఇంట్లో హానికరమైన కాలుష్య కారకాలకు గురవుతారు’’ అని నివేదికలో పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు క్లీన్ ఎనర్జీకి సమాన ప్రాప్యత లేదు, ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

దక్షిణాఫ్రికా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్‌కు చెందిన చీఫ్ స్పెషలిస్ట్ సైంటిస్ట్ కారేడీ రైట్ మాట్లాడుతూ.. ‘‘ఈ నివేదిక 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు, పిల్లల ఆరోగ్యానికి, జీవితానికి కూడా వాయు కాలుష్యం కలిగించే గణనీయమైన ముప్పు గురించి రుజువు చేస్తుంది. ఇళ్లలో వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. తల్లులు, సంరక్షకులకు ఆచరణాత్మక పరిష్కారాలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.’’ అని పేర్కొన్నారు.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ప్రాజెక్ట్.. ఈజిప్ట్, ఘనా, డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ ముఖ్యమైన ప్రాంతంలోని వాయు కాలుష్య పోకడలు, మూలాలు, సంబంధిత వ్యాధుల భారంపై చర్చించడానికి ఇటీవలి ప్రపంచ వాయు కాలుష్య మూలాల అంచనా నుండి ఈ నివేదిక డేటాను సేకరించింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.