Papaya Seeds: బొప్పాయి మాత్రమే కాదు.. దాని గింజల్లో దాగివున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

|

Oct 06, 2022 | 2:19 PM

అవును, పరంగి పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  బొప్పాయి గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయో, బొప్పాయి గింజలను ఎందుకు తీసుకోవాలి..

Papaya Seeds: బొప్పాయి మాత్రమే కాదు.. దాని గింజల్లో దాగివున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
Papaya Seeds
Follow us on

బొప్పాయి..దీనిని పరంగి పండు అని కూడా అంటారు..ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే పండు. పరంగి పండు ఆరోగ్యానికి మంచిదని మనకు ముందే తెలుసు. సాధారణంగా మనం పరంగి పండు తొక్క తీసి, గింజలను పనికిరాదని భావించి చెత్తబుట్టలో వేస్తాం. కానీ, పరంగి పండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? అవును, పరంగి పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  బొప్పాయి గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయో, బొప్పాయి గింజలను ఎందుకు తీసుకోవాలి అనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
పరంగి పండ్ల విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు:

* జలుబు నుండి రక్షణ:
పాలీఫెనాల్స్, ఫ్లేవలోయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు పరంగి పండ్ల గింజల్లో ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జలుబు వంటి అనేక వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

* కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది:
పరంగి పండ్ల గింజల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులలో తక్కువ ఫలకం ఉన్నప్పుడు, రక్తపోటు తగ్గుతుంది. ఈ విధంగా మీరు గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి గుండె జబ్బులను నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

* బరువు నియంత్రణ:
పరంగి పండ్ల గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే స్థూలకాయానికి గురికాకుండా , పెరుగుతున్న బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..