గురక సమస్యతో బాధపడుతున్నారా.? చికిత్స కోసం ఇక్కడి కొచ్చేయండి
జీవనశైలి మార్పులతో పెరుగుతున్న అబ్సట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యకు చికిత్స అందించేందుకు నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్ సిద్దమవుతుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ ల్యాబ్‌లో చికిత్స అందించనున్నారు వైద్యులు. ముఖ్యంగా అధిక బరువు..
జీవనశైలి మార్పులతో పెరుగుతున్న అబ్సట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యకు చికిత్స అందించేందుకు నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్ సిద్దమవుతుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ ల్యాబ్‌లో చికిత్స అందించనున్నారు వైద్యులు. ముఖ్యంగా అధిక బరువు, డ్రింక్, సిగరెట్ అలవాట్లు, శ్వాసనాళ్లలో సమస్య అంటే స్లీప్ అప్నియా అంటే గురకకు దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు. మరి నిమ్స్‌లో ఈ స్లీప్ అప్నియాకు ఎలాంటి వైద్యం అందించనున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..
గ్రేటర్ వ్యాప్తంగా 40 నుంచి 50 శాతం వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ సమస్య ఉన్నవారు కొన్నిసార్లు శ్వాస ఆగిపోయి ఆకస్మాత్తుగా మెలకువ రావడం.. మళ్లీ పడుకున్న కాసేపటికి అదే పరిస్థితి రిపీట్ అవ్వడం లాంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా మెదడుకు ఆక్సిజన్ అందక పక్షవాతం బారిన పడే ముప్పు ఉంటుందన్నారు. ఈ గురకతో గుండె స్పందన రేటు కూడా తగ్గుతుందని.. మహిళల కంటే పురుషులలో ఎక్కువ శాతం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని.. 30 ఏళ్లు దాటిన అధిక శాతం మందిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చికిత్స పొందుతే చాలావరకు సమస్యకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
స్లీప్ అప్నియా బాధితులను 24 గంటల పాటు ల్యాబ్‌లో ఉంచివారి నిద్రపై అధ్యయనం చేస్తారు. రోగి నిద్రిస్తున్న సమయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు కార్యకలాపాలు, శ్వాస విధానాలు, చేయి, కాలు కదలికలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తారు. ఈ పరీక్షనే పాలీ సోమ్నోగ్రాఫీ అంటారు. స్లీప్ అప్నియాను మూడు రకాలుగా విభజించి సమస్యను విశ్లేషించి రోగికి చికిత్స అందిస్తారు. ముక్కు శ్వాసనాలల్లో అడ్డంకులు ఉండే శాస్త్ర చికిత్సతో తొలగించడంతో పాటు జీవనశలిలో మార్పులకు సంబంధించిన సూచనలు సలహాలు అందిస్తారు. ఆల్కహాల్, ధూమపానం తగ్గించుకోవడం, రోజుకు గంట పాటు నడక, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలతో బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా గురక కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఈ ల్యాబ్‌ను ప్రారంభించి ప్రైవేట్ ఆస్పత్రులతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే చికిత్సకు ట్రీట్మెంట్ అందిస్తామని వైద్యులు చెబుతున్నారు.