Health Tips: స్నానం చేసే ముందు నీటిలో వేపాకు వేసుకుంటే ఎన్నో లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..

Health Tips: వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేపలోని మంచి గుణాలు మనకు దక్కాలనే ఉద్దేశంతో పెద్దలు వేప ఆకులు, బెరుడు, పువ్వులను సంప్రదాయంలో ఓ భాగం చేశారు...

Health Tips: స్నానం చేసే ముందు నీటిలో వేపాకు వేసుకుంటే ఎన్నో లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..
Health

Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2021 | 7:00 AM

Health Tips: వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేపలోని మంచి గుణాలు మనకు దక్కాలనే ఉద్దేశంతో పెద్దలు వేప ఆకులు, బెరుడు, పువ్వులను సంప్రదాయంలో ఓ భాగం చేశారు. ఎన్నో రకాల మెడిసిన్స్‌లో వేపా చెట్టుకు సంబంధించిన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇక వేప చెట్లు కూడా విరివిగా కనిపిస్తుంటాయి. మనకు అందుబాటులో ఉండే వేపతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. వీటిలో చర్మ సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టడం ఒకటి. వేపాకులను నీటిలో వేసి స్నానం చేయడం వల్లే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* పొడి చర్మంతో బాధపడే వారికి వేపాకు మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. వేపాకులను వేసి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిద‌నం త‌గ్గుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో డ్రై స్కీన్‌తో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

* వేప మంచి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే వేపాకులు వేసిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు త‌గ్గుతాయి.

* చుండ్రుతో బాధపడేవారికి కూడా వేపాకు బాగా ఉపయోగపడుతుంది. వేపాకు వేసిన నీటితో తల స్నానం చేస్తే చుండ్రు సమస్యతో పాటు జుట్టు కూడా ఆరోగ్యకరంగా మారుతుంది.

* వేపాకును పేస్ట్‌లా తయారు చేసుకొని శరీరానికి రాసి గంట సేపటి తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. చర్మంపై ఉండే ముడతలు కూడా తగ్గుతాయి.

* వేపాకు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్ త‌గ్గుతాయి.

* వేపాకు లభించదు అనుకునే వారు మార్కెట్లో దొరికే వేపనూనెను కూడా ఇలా వాడుకోచ్చు.

Also Read: Viral Video: కుక్క చేసిన పనికి నెటిజన్స్ షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: పాపం.. పెళ్లి వేడుకలో ఊహించని షాక్.. కిందపడిన వధూవరులు.. ఎందుకంటే..?

Asus Chromebook CX 1101: ఆసుస్ నుంచి సరికొత్త బడ్జెట్ క్రోమ్‌బుక్.. దీని ధర.. స్పెసిఫికేషన్లు ఇలా..