Viral Video: కుక్క చేసిన పనికి నెటిజన్స్ షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే
Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే.. విశ్వాసానికి ప్రతీక అయిన జంతువు కుక్కను చాలామంది పెంచుకుంటుంటారు. కుక్కలు ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన జంతువులుగా విశ్వసిస్తారు. అవి తమ సంరక్షకుని ప్రతి మాటను అనుసరిస్తాయి. అదే సమయంలో యాజమానుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. అలాంటి కుక్కలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వీడియోలు హృదయాన్ని తాకుతుంటాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే కుక్కలలో కూడా ఇన్ని తెలివితేటలు ఉన్నాయా..? అంటూ మీరే ఆశ్చర్యపోతారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. తల్లి-కొడుకుతోపాటు కుక్క టీవీ చూస్తున్నట్లు చూడవచ్చు. సోఫాలో తల్లీ కొడుకులు కూర్చొని ఉండగా.. వారి మధ్యలో కుక్క కూర్చుని టీవీ చూస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. అప్పుడు కొడుకు తన తల్లి దగ్గరున్న టీవీ రిమోట్‌ను లాక్కొని ఛానెల్ మార్చడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తల్లి అతని చేతిలోని రిమోట్‌ను లాక్కుంటుంది. ఆ తర్వాత ఆ బాలుడు మళ్లీ తన తల్లి చేతిలోని రిమోట్‌ని లాక్కున్నాడు. ఈ సన్నివేశాన్ని కుక్క చూస్తుంటుంది. ఈ క్రమంలో అబ్బాయి తన తల్లి చేతిలో రిమోట్ లాక్కోవడం చూసి.. వెంటనే రంగంలోకి దిగుతుంది. ఆ అబ్బాయి చేతిలోని రిమోట్ ని నోటితో లాక్కొని వృద్ధురాలికి ఇస్తుంది. దీని తర్వాత మళ్లీ రిమోట్ లాక్కోవద్దంటూ అబ్బాయిని హెచ్చరిస్తుంది. మళ్లీ కొడుకు రిమోట్‌ను లాక్కొగా.. అతని నుంచి రిమోట్‌ను లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
వైరల్ వీడియో..
Gimme the remote!pic.twitter.com/o56lxSfP5o
— Morissa (Dr. Rissy) Schwartz (@MorissaSchwartz) December 11, 2021
ఈ ఫన్నీ వీడియోను @MorissaSchwartz అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 1 లక్షా 25 వేలకు పైగా మంది నెటిజన్లు చూడగా.. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు పలువురు తమాషా కామెంట్లు చేస్తున్నారు. కుక్క వీడియో ఫన్నీగా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: