Neck Pain: తీవ్రమైన మెడ నొప్పి బాధిస్తోందా? ఈ చిట్కాలు చిటికెలో ఉపశమనం ఇస్తాయి..

|

Feb 15, 2023 | 11:03 PM

నిద్రపోయే విధానం, తీవ్రమైన ఒత్తిడి, ఎక్కువ సేపు ఒకే శారీరక భంగిమలో కూర్చోవడం వల్ల తీవ్రమైన మెడ నొప్పి వస్తుంది. మెడ కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి.

Neck Pain: తీవ్రమైన మెడ నొప్పి బాధిస్తోందా? ఈ చిట్కాలు చిటికెలో ఉపశమనం ఇస్తాయి..
Follow us on

నిద్రపోయే విధానం, తీవ్రమైన ఒత్తిడి, ఎక్కువ సేపు ఒకే శారీరక భంగిమలో కూర్చోవడం వల్ల తీవ్రమైన మెడ నొప్పి వస్తుంది. మెడ కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ కండరాలపై ఒత్తిడి వల్ల కలిగే నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దీని కారణంగా తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇది గర్భాశయం వల్ల కూడా వస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం ఎలా? మెడ నొప్పిక మందులే శరణ్యమా? అంటే అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు మెడ నొప్పి చిటికెలో నయం అవుతుందని చెబుతున్నారు.

ఆపిల్ వెనిగర్..

తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఆపిల్ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. వెనిగర్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఈ గుణాలు కండరాలలో టెన్షన్‌ని తగ్గిస్తాయి.

నూనెతో మసాజ్..

టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ కండరాల ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. మెడ నొప్పితో బాధపడుతున్నట్లయితే.. కొబ్బరి, ఆవనూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి మెడపై మసాజ్ చేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేయడం వల్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వేడి నీటితో స్నానం..

మెడ నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. వేడి నీళ్లతో స్నానం చేయాలి. అయితే, స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల చాలా త్వరగా మెడ నొప్పి సమస్య తగ్గుతుంది.

వ్యాయామం..

మెడ నొప్పి వేధిస్తున్నట్లయితే.. అందుకు సంబంధించిన వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిటారుగా కూర్చొని, తలను ఒకసారి ఎడమవైపునకు, మరోసారి కుడివైపునకి నెమ్మదిగా కదపాలి. నోటిని వీలైనంత ఎక్కువగా చాచాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..