Lifestyle: ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయ్.? ఈ లిస్టులో వీళ్లే ఎక్కువ.. కారణం ఇదే

ప్రయాణం సమయంలో తల తిరగడం, వాంతులు అవ్వడం లాంటి సమస్యలు రావడాన్ని మోషన్ సిక్ నెస్ అంటారు. కొంతమందిలో ఎక్కువగా ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు, మలుపుల వద్ద ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు, చెవుల నుంచి మెదడుకు వేరు వేరు సంకేతాలు చేరతాయి.

Lifestyle: ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయ్.? ఈ లిస్టులో వీళ్లే ఎక్కువ.. కారణం ఇదే
Motion Sickness

Edited By:

Updated on: Jan 19, 2026 | 1:08 PM

బస్సు, కారు, రైలు, విమానం వాహనం ఏదైనా ప్రయాణంలో వామిటింగ్ జరగడం అనేది చాలామందిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే వైద్యభాషలో దీనిని మోషన్ సిక్ నెస్ అని అంటారు. వెహికల్‌లో ప్రయాణం అవుతున్న సమయాల్లో ఎందుకు జరుగుతుంది అంటే.. ప్రయాణంలో వాంతులు చేసుకోవడానికి మనసు, కళ్ళు, శరీర సమతుల్యత మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ప్రయాణంలో వామిటింగ్ జరగకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే బాగుంటుందని వారు అంటున్నారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

ప్రయాణం సమయంలో తల తిరగడం, వాంతులు అవ్వడం లాంటి సమస్యలు రావడాన్ని మోషన్ సిక్ నెస్ అంటారు. కొంతమందిలో ఎక్కువగా ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు, మలుపుల వద్ద ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు, చెవుల నుంచి మెదడుకు వేరు వేరు సంకేతాలు చేరతాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు కళ్ళు కిందికి గమనిస్తున్నప్పుడు.. మీరు కదలడం లేదని మెదడుకు సంకేతమందుతుంది. కానీ చెవుల్లోని బ్యాలెన్స్ సిస్టం శరీరం కదులుతుందని మెదడుకు చెబుతుంది. ఈ డిఫరెంట్ సంకేతాలు శరీరంలోకి విషపూరితమైన పదార్థాలు ఏదో ప్రవేశించిందని శరీరాన్ని అలర్ట్ చేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో శరీరానికి తెలిసిన ఏకైక మార్గం దానిని బయటకు పంపడం అంటే వామిటింగ్ చేసుకోవడం అని ఢిల్లీలోని ప్రముఖ వైద్యులు మొహసిన్ వలి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ వామిటింగ్ నివారణకు కిటికీలోంచి దూరంగా చూడడం వల్ల కళ్ళు, చెవుల నుంచి వచ్చే సంకేతాలను మెదడు అర్థం చేసుకుని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల శరీరానికి కలిగే అసౌకర్యం తగ్గి వాంటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ మోషన్ సిక్ నెస్ అనేది ప్రతి ముగ్గురిలో ఒకరిని ప్రభావితం చేసే అంశంగా వైద్యులు చెప్తున్నారు. ఖాళీ కడుపుతో ప్రయాణం, బాగా తిని ప్రయాణం చేయడం, లాంటివి చేయడం వల్ల కూడా కొంతవరకు ప్రయాణాల్లో వాంతులు జరుగుతుంటాయి. అయితే ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందు భోజనం చేయకపోవడం లేదా ఖాళీ కడుపుతో ప్రయాణం చేయడం మంచిది కాదు. వాహనంలో నిద్ర పోవడం వల్ల కూడా సమతుల్యత దెబ్బతింటుందని.. దీని వల్ల వాంతులు అయ్యే అవకాశం పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. మోషన్ సిక్నెస్ పురుషులలో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందని.. స్త్రీలలో శారీరక హార్మోన్ల సమస్యల వల్ల వారికి వాంతులు వస్తాయని వైద్యులు అంటున్నారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.