నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!
కొన్ని సందర్భాల్లో నోటి విషయంలో మనం ఎంత హయ్యీజీన్ పాటించినా.. నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా మందికి భయంకరమైన అనుభవం అవుతుంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు. అయితే ఈ సమస్యను తీర్చేందుకు ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు.
![నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/mouth-odor.jpg?w=1280)
నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇది పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా బాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. కానీ సరిగా చూసుకుంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదు. కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి 30 సెకన్ల పాటు నోటిని క్లీన్ చేసుకోండి. దీని వల్ల దుర్వాసన తగ్గుతుంది.
సిట్రిక్ పండ్లు
నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రిక్ పండ్లను నమలడం వల్ల లాలాజ గ్రంథులు యాక్టివ్ అయ్యి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
తులసి ఆకులు
తులసి ఆకులు కూడా నోటి దుర్వాసనను తగ్గించే గొప్ప పరిష్కారం. ఈ ఆకులలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి శుభ్రతను పెంచుతుంది. కొన్ని ఆకులను నమలడం లేదా తులసి టీ తయారు చేసి తాగడం వల్ల సమస్య తగ్గుతుంది.
ఆవనూనె
పళ్ళను శుభ్రం చేసేటప్పుడు ఆవనూనెలో కొద్దిగా ఉప్పు కలిపి తోమడం వల్ల ఫ్లాక్, కావిటీస్ నివారించవచ్చు. ఆవనూనెలో యాంటీ మైక్రోబయల్ గుణం ఉండటంతో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా నిలిపిస్తుంది.
నోటి శుభ్రత
భోజనం తరువాత సోంపు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, పార్స్లీ, పిప్పరమెంట్, తులసి వంటివి నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి సహజ సుగంధాలు కలిగి ఉంటాయి. అవి నోటి శుభ్రతను కాపాడుతాయి. ఈ చిట్కాలను ఇంట్లోనే అనుసరించడం వల్ల నోటి దుర్వాసన సమస్యను క్షణాల్లో తగ్గించవచ్చు.