Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చేసే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..
Monsoon Health Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2023 | 1:31 PM

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చేసే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో రక్తపోటు సమస్యలు ఉన్నవారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ కోసం ఈ సూచనలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు..

హైడ్రేషన్: వర్షాకాలంలో తగినంత నీరు త్రాగాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు అవసరం. వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేట్‌కు కారణం అవుతుంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కషాయాలు, డ్రింక్స్: వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ, చమోమిలే హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

సీజనల్ ఫ్రూట్స్: సీజన్‌లో లభించే పండ్లను తినాలి. యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థనె పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను నిరోధిస్తాయి.

విటమిన్ సి: రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి.

తేలికపాటి, సమతుల భోజనం: వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి: వెల్లుల్లి, ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి.

బయటి ఫుడ్స్ తినొద్దు: వర్షాకాలంలో బయటి ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా బయటి ఫుడ్స్‌ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..