Monsoon Diet: పియర్‌ ఫ్రూట్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వర్షాకాలంలో ఎందుకు తప్పకుండా తీసుకోవాలంటే..

Benefits Of Pear Fruit: పియర్స్ వర్షాకాలంలో సమృద్ధిగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి...

Monsoon Diet: పియర్‌ ఫ్రూట్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వర్షాకాలంలో ఎందుకు తప్పకుండా తీసుకోవాలంటే..
Pear Fruit

Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

Benefits Of Pear Fruit: పియర్స్ వర్షాకాలంలో సమృద్ధిగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, ఫోలేట్ తదితర పోషకవిలువలు అధికంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. పలు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి రక్షిస్తాయి. ఈ పండను అనేక రకాలుగా తినవచ్చు. జ్యూస్ లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పైగా ఇందులో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అందువల్ల, బేరి పండ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మరి వర్షాకాలంలో ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఎముకలకు మేలు 
పియర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎముకలు బలహీనపడకుండా కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.

రక్తహీనత
పియర్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల్లో రక్తహీనత లోపాన్ని నివారిస్తుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు బేరిని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

శక్తివంతంగా ఉండటానికి
ఎనర్జీ లెవల్స్ పెంచడంలో సహాయపడే పోషకాలు బేరిలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి..
ఈ పండ్లలో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా దీనిని డైట్‌లో చేర్చుకోవాలి.

జీర్ణవ్యవస్థ పటిష్టం
పియర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీని వినియోగం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

మధుమేహం వారికి
మధుమేహంతో బాధపడే వారికి కూడా ఈ పండు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహం సమస్యను తగ్గించేందుకు సహాయపడతాయి.

చర్మం ఆరోగ్యం కోసం..
బేరిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఎ, సి,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫలితంగా చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..