Benefits of Plum: సీజనల్ పండు రేగు పండులో పోషకాలు మెండు.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు.. మిస్ అవ్వకుండా తీసుకోండి..

|

Jun 27, 2022 | 6:42 AM

ఈ రేగు పండుని అనేక విధాలుగా తినవచ్చు. రేగు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

Benefits of Plum: సీజనల్ పండు రేగు పండులో పోషకాలు మెండు.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు.. మిస్ అవ్వకుండా తీసుకోండి..
Indian Plum
Follow us on

Benefits of Plum: ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్ లో తినడం ఆరోగ్యానికి మంచిది. వర్షాకాలంలో లభించే సీజనల్ పండు రేగు పండు. ఈ రేగు పండ్లు (Benefits of Plum) రుచికరమైన పండు.  పొటాషియం అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి. రేగు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఈ పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఈ రేగు పండుని అనేక విధాలుగా తినవచ్చు. రేగు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

రేగు పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు:
రేగు పండ్లు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు ఒత్తుగా చేయడానికి పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీరు ఆహారంలో రేగు పండ్లను కూడా చేర్చుకోవచ్చు.

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:
రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి విముక్తినిస్తుంది. ఇందులో ఇసాటిన్,  సార్బిటాల్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగనివ్వని పోషకాలు రేగు పండ్లలో ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి పనిచేస్తుంది. ఇది నోటి, రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం ఇస్తుంది:
రేగు పండ్లలో క్లోరోజెనిక్ యాసిడ్ సహా ఇతర ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మీకు ఒత్తిడి లేదా ఆత్రుతగా అనిపిస్తే.. రేగు పండ్లను తినవచ్చు. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది:
రేగు పండ్లు జీవక్రియను కూడా పెంచుతాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మానికి ప్రయోజనకారి: 
రేగు పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.  ముడతలను తగ్గిస్తుంది. చర్మం ఎరుపు మచ్చలను నివారిస్తుంది.

ఎముకలు ధృడంగా ఉండడానికి:
రేగు పండ్లలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. దీని వినియోగం మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. మహిళలు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. మీరు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నా వైద్యులు, నిపుణులను సంప్రదించాలి. పైన పేర్కొన్న ఏదైనా వస్తువులను తీసుకునే ముందు, మీ శరీరానికి సంబంధించిన వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది)