AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millet Benefits: తాతముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణధాన్యాలు.. వీటిని తినడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా ..

Millet Benefits:తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న  పాలియో డైట్..

Millet Benefits: తాతముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణధాన్యాలు.. వీటిని తినడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా ..
Millets
Surya Kala
|

Updated on: Sep 21, 2021 | 12:40 PM

Share

Millet Benefits:తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న  పాలియో డైట్ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులుహెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం  వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తృణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్.  తృణధాన్యాలు తినడం మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో అనేక వ్యాధులను నివారిస్తుంది, ఈరోజు తృణధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

 భారతదేశములో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ. అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు.. వీటినే తృణ ధాన్యాలు అంటారు. వీటిలోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70-80 శాతం ఇస్తాయి.  అంతేకాదు ఇతర పోషకపదార్ధాలైన మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పీచు పదార్థాలు,   బికాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయి. ఇవి మనిషికి వచ్చే రకరకాల వ్యాధులను దరిచేరనివ్వవు.

తృణధాన్యాలు తీసుకోవాల్సిన విధానం:

*తృణధాన్యాలను కాయధాన్యాలతో కలిపి తీసుకుంటే బియ్యం పప్పు లాగా మాంసకృత్తులను అధిక మొత్తంలో శరీరానికి అందిస్తాయి. *ఉప్పుడు బియ్యం: ధాన్యాన్ని నీటిలో నానబెట్టి, ఆవిరిపట్టే ఉప్పుడు బియ్యం వస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషకాలు విటమిన్లు అందుతాయి. *రాగులు,జొన్నలు,సజ్జల్లో ఖనిజాలను, పీచు ను బాగా కలిగిఉంటాయి.రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే బియ్యంలో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉంటాయి. ఆహారంగా తీసుకుంటే శరీరానికి ఫైబర్ అంది.. తిన్న ఆహారాం త్వరగా జీర్ణమవుతుంది. *తృణధాన్యాలు 6-12శాతం మాంసకృత్తులను కలిగిఉంటాయి. అంతేకాదు వీటిల్లో అమినో ఆసిడ్ లైసిన్ ను తక్కువగా  ఉంటాయి. శరీరానికి నిత్యం అవసరమయ్యే మాంసకృత్తుల్లో 50శాతం అవసరాన్ని తీరుస్తాయి. *తృణధాన్యాలు  బి-విటమిన్లకు మంచివనరులు. *మనం ఎలా,ఎంతమేరకు బియ్యాన్ని శుభ్రం చేస్తున్నామో,పాలిష్ పట్టిస్తున్నామో దానిమీద ఆధారపడి బియ్యములోని బి-విటమిన్ కోల్పోతున్నామో తెలుస్తుంది. ఎదుకంటే బియ్యపు గింజయొక్క వెలుపలి భాగములోనే అధికశాతం విటమిన్లు ఉంటాయి. ఎక్కువ పాలిష్ పట్టించిన బియ్యంలో అతితక్కువ బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. *తృణధాన్యాలలో ఉండే క్రొవ్వుశాతం ప్రతి వందగ్రాములకు 2-5 గ్రాములుగా ఉంటుంది. తృణధాన్యాలు మనకు కావాల్సిన ఫాటీ ఆసిడ్ అవసరాల్లో 50శాతానికి పైగా తీరుస్తాయి,ఇది మనం ఎంతమేరకు ఎంత పరిమాణమములో తృణధాన్యాలను తీసుకుంటున్నామన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక డాక్టర్లు కూడా ఆరోగ్యంగా పది కాలాల పాటు బతకాలంటే చిరు ధాన్యాలు లేదా తృణ ధాన్యాలను తినాలంటూ సూచిస్తున్నారు Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి ఉచిత దర్శనం షురూ.. దర్శన సమయం పెంపు

Addasaram Benefits: శరీరంలోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వ వ్యాధులను నివారించే ఔషధం ‘అడ్డసరం’.. ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..