Tamilnadu CM Stalin: పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం స్టాలిన్.. ప్రజల మధ్యలో సామాన్యుడిలా వాకింగ్
CM Stalin-Morning Walk:సెలబ్రెటీలకైనా, సామాన్యులకైనా ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకనే పెద్దలు అందం, ఆస్థి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. నిత్యం శారీరక శ్రమ చేస్తూ నిండు నూరేళ్లు..
CM Stalin-Morning Walk:సెలబ్రెటీలకైనా, సామాన్యులకైనా ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకనే పెద్దలు అందం, ఆస్థి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. నిత్యం శారీరక శ్రమ చేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే అందం ఆస్థి, హోదా, అధికారం ఇలా ఎన్ని ఉన్నా అవేమీపనికిరావు. అందుకనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆరోగ్యంగా ఉండాలని ఫిట్ నెస్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మంచి అవగాహన ఉంది. 68 ఏళ్ల వయసులో కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తుంటారు.
తాజాగా సీఎం స్టాలింగ్ చెన్నైలోని ఆడయార్ పార్క్ లో మార్నింగ్ వాక్ బాట పట్టారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న ఇతర వాకర్స్ తో పలు విషయాలపై మాట్లాడారు. వాకర్స్ ను అడిగి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు సీఎం తో మాట్లాడుతూ.. మీ పాలన బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మీరు .. సామాన్య మానవుడిలా ఇలా ప్రజల మధ్యకు రావడం గొప్ప అని.. మీరు ప్రజల మధ్యలో ఇలా ఉండడం అసాధారణమని కొనియాడారు.
సీఎం స్టాలిన్ చాలా ఫిట్ గా, స్లిమ్ గా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు సీఎం గా అధికారంలో ఉన్నా స్టాలిన్ ఒక్క రోజు కూడా వర్కౌట్స్ చేయకుండా ఉండరని తెలుస్తోంది. చెన్నై లోని జిమ్ లో ప్రొఫెషనల్ ట్రైనర్ సమక్షంలోనే స్టాలిన్ జిమ్ చేస్తుంటారు.
స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎం కు మంచి పేరు తెచ్చాయి. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ.. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగిస్తున్న స్టాలిన్ నేచర్ కు ప్రతిపక్షాల నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: చిత్ర పరిశ్రమలో విషాదం.. సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత.. ప్రముఖులు సంతాపం