Publicity Designer Eshwar: చిత్ర పరిశ్రమలో విషాదం.. సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Publicity Designer Eshwar Dead: లెజెండరీ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) అనారోగ్యంతో ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో కన్నుమూశారు. డిజైనర్ ఈశ్వర్ పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని..
Publicity Designer Eshwar Dead: లెజెండరీ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) అనారోగ్యంతో ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో కన్నుమూశారు. డిజైనర్ ఈశ్వర్ పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్ స్వాతంత్ర వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. బొమ్మలు గీయడంలో ఉన్న ఫాషన్ తో ఈశ్వర్ చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పేశారు. కాకినాడలో పాలిటెక్నిక్ చదువుతూ.. మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టేసి చిత్రకారుడిగా అవకాశాల కోసం మద్రాస్‌కు చేరుకున్నారు.
బాపు దర్శకత్వం వహించిన సాక్షి (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ సినీ ప్రయాణం మొదలు పెట్టారు. అనంతరం సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా సినీ పోస్టర్స్ డిజైన్, లోగోల క్రియేషన్స్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌లో ఈశ్వర్ మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత తన పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీ ప్రారంభించారు. సినిమా కోసం కలర్ పోస్టర్లు, లోగో తయారు చేశారు. ‘పాప కోసం’ సినిమాకు బ్రష్ తో కాకుండా, నైఫ్ వర్క్‌తో పోస్టర్లు రూపొందించి గుర్తింపు పొందారు. హిందీ, తమిళ వెర్షన్లకూ అలాంటి పోస్టర్లే రూపొందించారు. పోస్టర్స్ డిజైనింగ్ లో గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత ఈశ్వర్ చేసిన చివరిచిత్రం దేవుళ్ళు.
ఈశ్వర్ మంది చిత్రకారులే కాదు.. మంచి రచయిత కూడా ఆయన సినిమా పోస్టర్ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు. “ఈశ్వర్ తో మా సంస్థకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు. అంతేకాదు ఈశ్వర్ మా సంస్థలో అత్యధిక చిత్రాలకు పనిచేశారు. నాన్న గారికి ఆయన డిజైన్స్ అంటే ఎంతో ఇష్టం.కేవలం పబ్లిసిటీ డిజైనర్‌గానే కాకుండా ఎన్నో సినిమాలకి క్యారెక్టర్ పోస్టర్స్ కూడా డిజైన్ చేశారని సురేష్ బాబు గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈశ్వర్ పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యలకు మా ప్రగాడ సానూభూతిని బాలకృష్ణ తెలిపారు.
Also Read: Millet Benefits: తాతముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణధాన్యాలు.. వీటిని తినడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా ..