భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధులలో మధుమేహం ఒకటి.. మన దేశంలో ఈ వ్యాధి వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలో ఇన్సులిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, గ్లూకోజ్ రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది.. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుంది. డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి.. దీనిలో ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి తీపి పదార్థాలు లేదా ఆహారం వల్ల మాత్రమే కాకుండా టెన్షన్ వల్ల కూడా వస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి వస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒత్తిడి సమయంలో.. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది.. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి షుగర్ అదుపు తప్పుతుంది. కుటుంబం, పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు రక్తంలో చక్కెరను పెంచడానికి ముఖ్యమైన కారకాలు. మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని చర్యలు ఉన్నాయి.. వీటిని అనుసరించడం ద్వారా మీరు మధుమేహాన్ని నివారించవచ్చు.. ఆరోగ్యంగా ఉండవచ్చు.
మానసిక ఒత్తిడి నేడు ప్రజలకు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఒత్తిడి కారణంగా అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇందులో మధుమేహం మొదటి స్థానంలో ఉంటుంది. నేడు ఒత్తిడి కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో.. మానసిక ఒత్తిడిని నివారించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజుల్లో మధుమేహం గురించి వినగానే ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యాధి తమను వెంబడిస్తుందని ఆందోళన చెందుతున్నారు.. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి గురించి అవగాహనతో ఉండాలి.. అంతేకాకుండా మీ చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుతూ ఉండాలి.. అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు వాడాలి. డాక్టర్‌ని సంప్రదించకుండా మధుమేహానికి సంబంధించిన మందులు తీసుకోకూడదు.
మధుమేహం రాకుండా ఉండాలంటే ముందుగా సమతులాహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉంటాయి. దీని ద్వారా మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీ దినచర్యను మెరుగుపరచడం కూడా ముఖ్యం. అంటే ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు దినచర్యను మెరుగుపరుచుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు అధిక తీపి, వేయించిన, కొవ్వు పదార్ధాలను నివారించడం, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం చాలా అవసరం.. మనం ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే మధుమేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
యోగా, ధ్యానంతోపాటు ప్రతిరోజూ 30-45 నిమిషాల వ్యాయామం ఒత్తిడిని తగ్గించడానికి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీలైతే, రోజులో మరింత నడవండి.. ఉదయం సాయంత్రం వేళల్లో నడకను అలవాటు చేసుకోండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..