Menopause Symptoms: ఆ వయస్సు వారిని వేధిస్తున్న రుతుక్రమ సమస్య.. ఆయుర్వేద చిట్కాలతో దూరం కావాల్సిందే..!

| Edited By: Ravi Kiran

Jul 17, 2023 | 7:00 AM

12 నెలల దాటి రుతుక్రమం రాకపోతే సాధారణంగా మోనోపాజ్  లక్షణాలు కనిపిస్తాయి.  అయితే మోనోపాజ్‌కు ముందు నుంచే పెరిమోనోపాజ్ లక్షణాలు మహిళలక హెచ్చరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోనోపాజ్ వచ్చే ముందు పెరిమోనోపాజ్ లక్షణాలు అంటే రుతుక్రమ విషయంలో మార్పులు, హాట్ ఫ్లాషెస్ వంటి లక్షణాలు స్త్రీలను వేధిస్తూ ఉంటాయి.

Menopause Symptoms: ఆ వయస్సు వారిని వేధిస్తున్న రుతుక్రమ సమస్య.. ఆయుర్వేద చిట్కాలతో దూరం కావాల్సిందే..!
Lady
Follow us on

సాధారణంగా వయస్సు మళ్లిన రుతుక్రమ విషయంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారికి చాలా రోజులు వారికి రుతుక్రమం రాదు. ముఖ్యంగా ఇలాంటి వారిని వారిని మోనోపాజ్ లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 12 నెలల దాటి రుతుక్రమం రాకపోతే సాధారణంగా మోనోపాజ్  లక్షణాలు కనిపిస్తాయి.  అయితే మోనోపాజ్‌కు ముందు నుంచే పెరిమోనోపాజ్ లక్షణాలు మహిళలక హెచ్చరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోనోపాజ్ వచ్చే ముందు పెరిమోనోపాజ్ లక్షణాలు అంటే రుతుక్రమ విషయంలో మార్పులు, హాట్ ఫ్లాషెస్ వంటి లక్షణాలు స్త్రీలను వేధిస్తూ ఉంటాయి. ఇది సహజమైన జీవ ప్రక్రియ అయినప్పటికీ మోనోపాజ్ శారీరక, మానసిక లక్షణాలు మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. ముఖ్యంగా మీ శక్తిని తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రుతువిరతి పరివర్తన స్త్రీలను వేర్వేరు విభిన్న మార్గాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో స్త్రీలు విపరీతంగా బరువు పెరుగుతారు. అలాగే ఎముక, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రుతువిరతి సాధారణ జీవప్రక్రియే అయినా దానికి గురయ్యే సమయంలో శారీరక, మానసిక అశ్శాంతికి గురవుతాం. కాబట్టి ఆయుర్వేద నిపుణులు ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అవేంటో? ఓ సారి తెలుసుకుందాం

అలోవెరా

అలోవెరా జెల్‌లో ఫైటోఈస్ట్రోజన్‌లు అధికంగా ఉంటాయి. ఇది హర్మోన్ల అసముతల్యతను సరి చేయడానికి సహాయం చేస్తుంది. అలోవెరా జెల్ శరీరాన్ని రీ హైడ్రేట్ చేస్తుంది. ఈ జెల్ క్లైమాక్లెరిటిక్ లక్షణాలు తిప్పికొడుతుంది. కాబట్టి రుతువిరతి లక్షణాలతో బాధపడేవారు ఉదయాన్నే ఓ స్పూన్ అలోవెరా జెల్‌ను తీసుకుంటే మంచిది. 

శతావరి

సాధారణంగా శతావరిని మహిళల ఆరోగ్యానికి ఓ టానిక్ లాంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. శతావరి ముఖ్యంగా యోని ఉత్సర్గ, రాత్రి సమయంలో చెమటలు, ఆందోళన, హాట్ ఫ్లాషెస్, మూడు స్వింగ్‌ల వంటి రుతవిరతి లక్షణాలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఓ టేబుల్ స్పూన్ శతావరి పొడిని ఏదైనా ద్రవపదార్థంలో కలిపి తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మెంతి గింజలు

మెంతి గింజలు సహజ హార్మోన్ల బ్యాలెన్సింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బరం, వేడి ఆవిర్ల సమస్యను దూరంగా ఉంచుతాయి. అరటేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

అశోక పౌడర్

అశోక పౌడర్‌ను సాధారణంగా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఇది అండాశయ పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఓ టేబుల్ స్పూన్ అశోక పౌడర్‌ను తీసుకుంటే మంచిది. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం