పాలల్లో ఈ కాయల పొడిని కలిపి తాగితే.. దెబ్బకు కొవ్వు కరగాల్సిందే!!

|

Aug 04, 2023 | 9:43 PM

రోగాలు లేని ఇల్లు, మనుషులు లేరు. ఎవరిని కదిపినా ఏదొక అనారోగ్యం ఉందని ఖచ్చితంగా చెప్తారు. పైకి గుండ్రాయిలా, నిబ్బరంగా కనిపించినా.. లోపల శరీరాన్ని గుల్లచేసే రోగాలు చాలానే ఉంటాయి. ఆఖరికి డజన్ల కొద్దీ మాత్రలు మింగితే గానీ రోజు గడవని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకే.. ఇప్పటి నుంచైనా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే.. మిగిలిన జీవితాన్నైనా ఎంతోకొంత ఆరోగ్యంగా బతకొచ్చు. పల్లేరు కాయలు గురించి వినే ఉంటారు. ఇవి అక్కడక్కడా చేలగట్లపై కనిపిస్తుంటాయి. పనికిరానివని అనుకుంటే పొరపాటే..

పాలల్లో ఈ కాయల పొడిని కలిపి తాగితే.. దెబ్బకు కొవ్వు కరగాల్సిందే!!
Palleru Kayalu
Follow us on

రోగాలు లేని ఇల్లు, మనుషులు లేరు. ఎవరిని కదిపినా ఏదొక అనారోగ్యం ఉందని ఖచ్చితంగా చెప్తారు. పైకి గుండ్రాయిలా, నిబ్బరంగా కనిపించినా.. లోపల శరీరాన్ని గుల్లచేసే రోగాలు చాలానే ఉంటాయి. ఆఖరికి డజన్ల కొద్దీ మాత్రలు మింగితే గానీ రోజు గడవని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకే.. ఇప్పటి నుంచైనా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే.. మిగిలిన జీవితాన్నైనా ఎంతోకొంత ఆరోగ్యంగా బతకొచ్చు.

పల్లేరు కాయలు గురించి వినే ఉంటారు. ఇవి అక్కడక్కడా చేలగట్లపై కనిపిస్తుంటాయి. పనికిరానివని అనుకుంటే పొరపాటే.. వీటిని కరెక్ట్ గా వాడితే.. మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. పల్లేరు మొక్క, దాని నుంచి వచ్చే కాయలు మనకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి.మరి దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా.

-ఒక గ్లాస్ పాలను తీసుకుని.. ఒక కళాయిలో వేడి చేసుకోవాలి. 4 ఎండిన పల్లేరు కాయల్ని పొడి చేసుకుని ఆ పాలలో వేసి.. మూడు పొంగులు వచ్చేంత వరకూ మరగనివ్వాలి.

ఇవి కూడా చదవండి

-ఇప్పుడు పాలను వడగట్టి గ్లాస్ లోకి తీసుకుని.. పటికబెల్లం లేదా తేనెను కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగాలి.

-ఇలా వారానికి నాలుగు సార్లైనా పల్లేరు కాయల పొడిని కలిపి తయారు చేసుకున్న పాలను తాగితే.. కాలేయంలో పేరుకున్న మలినాలు తొలగి.. కాలేయం శుభ్రమవుతుంది.

-మూత్రపిండాలు (కిడ్నీలు)లో ఏర్పడిన రాళ్లు కూడా కరిగి.. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడుకొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారు.

-మహిళలు ఈ పాలను తాగితే.. బహిష్ఠు (periods), గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫ దోషాలు తొలగుతాయి.

-నోటి సమస్యలు, చిగుళ్ల నొప్పి, దంతాల సమస్యలతో పాటు కంటి సంబంధిత దోషాలు కూడా తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి