Kitchen Hacks: చలిని తగ్గించే మసాలా గ్రీన్ టీ

|

Aug 19, 2023 | 8:25 PM

కాలం మారి.. తినే ఆహారం మారడంతో.. అనారోగ్యాలు ఎక్కువయ్యాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా హెల్దీగా ఉండేందుకు గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారు. దానిలో టేస్ట్ కోసం హనీ, నిమ్మరసం కలుపుకుని కూడా తాగొచ్చు. వర్షాకాలంలో గ్రీన్ టీ రోజూ తాగితే.. మంచిదని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నా.. తరచూ వర్షాలు పడుతుంటాయి కాబట్టి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా..

Kitchen Hacks: చలిని తగ్గించే మసాలా గ్రీన్ టీ
Green Tea
Follow us on

కాలం మారి.. తినే ఆహారం మారడంతో.. అనారోగ్యాలు ఎక్కువయ్యాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా హెల్దీగా ఉండేందుకు గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారు. దానిలో టేస్ట్ కోసం హనీ, నిమ్మరసం కలుపుకుని కూడా తాగొచ్చు. వర్షా కాలంలో గ్రీన్ టీ రోజూ తాగితే.. మంచిదని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నా.. తరచూ వర్షాలు పడుతుంటాయి కాబట్టి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

అలాగే వర్షాలు పడినపుడు కాస్త చలిగా కూడా ఉంటుంది. ఇంకా నెలరోజులు ఆగితే..చలికాలం కూడా నెమ్మదిగా మొదలవుతుంది. ఇలాంటి సమయంలో గ్రీన్ టీ మాత్రమే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సరిపోదు. ఇందుకు మసాలా గ్రీన్ టీ తయారు చేసుకుని తాగితే శరీరం వెచ్చగా ఉండటంతో పాటు.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీర మెటబాలిజం పెరిగి.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గొచ్చు.

మసాలా గ్రీన్ టీ తయారీకి కావలసిన పదార్థాలు:

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ ఆకులు – 1.1/2 టీ స్పూన్, గ్రీన్ టీ బ్యాగ్ 1, నీళ్లు – 1.1/2 కప్పు, దాల్చిన చెక్క స్టిక్ – 1, తురిమిన అల్లం – 1 టీ స్పూన్, లవంగాలు – 2, లెమన్ గ్రాస్ – 1/2 టీ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్, తేనె – రుచికి సరిపడా,

మసాలా గ్రీన్ టీ తయారీ విధానం:

ఒక గిన్నెలో 2 కప్పుల నీరు పోసి.. అందులో పైన తెలిపిన క్వాంటిటీలో అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, లెమన్ గ్రాస్ వేసి మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి గ్రీన్ టీ ఆకులు లేదా గ్రీన్ టీ బ్యాగ్ వేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం వీటిని కప్పులోకి వడగట్టుకోవాలి. ఈ మసాలా గ్రీన్ టీ లో నారింజ జ్యూస్ లేదా తేనె కలుపుకుని తాగితే.. చలి తగ్గుతుంది. శరీరం వెచ్చగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి