ఆయుర్వేదానికి పనికిరాని మొక్కలంటూ ఉండవు. ఆఖరికి పశువులు తినే గడ్డిని ఉపయోగించి కూడా కొన్నిరకాల రోగాలకు మందుల్ని తయారు చేస్తారు. మనం పిచ్చిమొక్కలు అనుకుని పీకిపారేసే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కుప్పింటాకు. పల్లెటూళ్లలోనే కాదు.. పట్టణాల్లోనూ ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ పిచ్చి మొక్కగా భావించి పీకిపారేస్తుంటాం. ఇప్పుడీ మొక్కనే గురక, చెవుడుతో పాటు.. గజ్జి, తామర వంటి చర్మవ్యాధులను తగ్గించేందుకు వాడుతున్నారు.
-కుప్పింటాకుకు సున్నం కలిపి మెత్తగా నూరి.. ఆ లేపనాన్ని దురద, దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు ఉన్నచోట రాయాలి. ఇలా 4-5 రోజుల పాటు రాయడం వల్ల చర్మవ్యాధులు పూర్తిగా నయమవుతాయి.
-గురక, చెవుడు సమస్యలున్నవారు.. కుప్పింటాకు తైలాన్ని వాడితే ఉపశమనం ఉంటుంది. ఒక గుప్పెడు కుప్పింటాకులను తీసుకుని.. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మిరియాలను కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రాముల నువ్వుల నూనెలో వేసి కాయాలి. రసాన్ని పూర్తిగా పీల్చుకునేంతవరకూ మరగనిచ్చి.. ఆ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ 2-3 చుక్కల మోతాదులో చెవుడు ఉన్న చెవిలో వారం రోజులపాటు వేసుకుంటే.. వినికిడి సమస్య తగ్గుతుంది.
-అలాగే.. రాత్రి పడుకునే ముందు ముక్కులో వేసుకుని పడుకుంటే.. గురక సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. కీళ్ల నొప్పులున్నవారు కూడా ఈ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దనా చేసుకుంటే.. తగ్గుతుంది.
-నరాలు చచ్చుబడి పక్షవాతంతో ఉన్నవారికి కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. కుప్పింటాకు మొక్క వేర్ల బెరడు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మాత్రలుగా చేసుకుని రోజుకి రెండుపూటలా మింగాలి. ఇలా క్రమంగా ఈ మాత్రలు తీసుకోవడం ద్వారా చచ్చుబడిన నరాల్లో కదలికలు వచ్చి.. పక్షవాతం సమస్య తగ్గి.. మళ్లీ మామూలు స్థితికి వస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి