Makhana benefits: సులభంగా బరువు తగ్గేందుకు మఖానా.. ఈ సూపర్‌ ఫుడ్‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..

|

Jul 15, 2022 | 5:05 PM

Makhana Eating Tips: బరువు తగ్గించుకోవాలనుకునేవారు శారీరక వ్యాయామాలతో పాటు తీసుకునే ఆహారంపై కూడా ప్రధాన దృష్టి సారిస్తారు. ముఖ్యంగా క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అలా బరువు తగ్గించే సూపర్‌ఫుడ్స్‌లో మఖానా (Makhana) కూడా ఒకటి.

Makhana benefits: సులభంగా బరువు తగ్గేందుకు మఖానా.. ఈ సూపర్‌ ఫుడ్‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..
Makhana Health Benefits
Follow us on

Makhana Eating Tips: బరువు తగ్గించుకోవాలనుకునేవారు శారీరక వ్యాయామాలతో పాటు తీసుకునే ఆహారంపై కూడా ప్రధాన దృష్టి సారిస్తారు. ముఖ్యంగా క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అలా బరువు తగ్గించే సూపర్‌ఫుడ్స్‌లో మఖానా (Makhana) కూడా ఒకటి. ఇది పిండి పదార్థాలతో కూడిన గింజల్లాంటివి. వీటిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా కూడా పరిగణిస్తారు. చాలామంది వీటిని నెయ్యిలో బాగా వేయించి తింటారు. ఇందులో పలు పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇక వీటిలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. అదేవిధంగా మఖానాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఉదర సంబంధిత సమస్యలేవీ దరిచేరవు. ఇక ఇందులోని పీచు ప్రత్యేకత ఏంటంటే.. దీనిని తీసుకున్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది. అయితే వీటిని సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

అతిగా వద్దు..

కొంతమంది ఆరోగ్యంగా ఉండటానికి మఖానాను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటారు. కానీ ఇది అంత మంచిది కాదు. ఇక మఖానాలు వేయించుకుని తినడం చాలా మందికి ఇష్టం. అయితే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 6 నుండి 7 మఖానాలు తీసుకుంటే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. ఇక స్మూతీల్లో కలిపి కూడా వీటిని తీసుకోవచ్చు. ఇలా తినడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉదయం పూట..

చాలా మంది మఖానాను చిరుతిండిగా, స్నాక్స్‌గా ఎప్పుడుపడితే అప్పుడు తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మఖానా స్మూతీల్లో కలుపుకొని తినవచ్చు లేదా నెయ్యిలో వేయించి తీసుకోవచ్చు. అయితే వీటినిఉదయాన్నే తింటే తేలికగా జీర్ణం అవుతుందట. అలాగే పొట్ట కూడా చాలా సేపు నిండుగా ఉంటుంది. ఫుడ్‌ క్రేవింగ్స్‌ (ఆహార కోరికలు ) కూడా ఇబ్బంది పెట్టవు. ఫలితంగా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఉదర సమస్యలు దరిచేరకుండా..

మెటబాలిజం రేటు బాగా ఉంటే పొట్ట ఆరోగ్యం కూడా బాగుంటుంది. మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన, ఇది జీర్ణక్రియ, జీవక్రియల రేటును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, మలబద్ధకం వంటి ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి