ఖాళీ కడుపుతో నిమ్మరసం.. మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా..?
నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో తాగితే అది మన శరీరానికి నష్టం చేయొచ్చు. దీని వల్ల ఎముకలు బలహీనపడటం, పంటి సమస్యలు, డీహైడ్రేషన్, అరుగుదల సమస్యలు ఇంకా కిడ్నీల పై ఒత్తిడి లాంటివి రావచ్చు.

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చాలా మంది నమ్ముతారు. బరువు తగ్గించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు చాలా లాభాలు ఉన్నా.. దీన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం శరీరానికి చెడు ఫలితాలు కలిగించే అవకాశం ఉంది.
ఎముకలు బలహీనపడటం
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఉదయం పొట్టలో ఏమీ లేకుండా నిమ్మరసం తాగితే అందులోని ఆమ్ల పదార్థాలు ఎముకలలోని ఖనిజాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల ఎముకల బలం తగ్గి వయసు పెరిగే కొద్దీ ఎముక సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
దంతాల సమస్యలు
నిమ్మరసంలోని ఆమ్లత దంతాలను కాపాడే ఎనామిల్‌ను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా పళ్లు సున్నితంగా మారి దంత క్షయానికి దారి తీస్తాయి. అందు వల్ల నిమ్మరసం తాగిన వెంటనే నోటిని నీటితో కడగడం అవసరం.
డీహైడ్రేషన్ ప్రమాదం
నిమ్మరసంలో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం మూత్ర విసర్జనను పెంచుతుంది. మీరు ఖాళీ కడుపుతో దీన్ని తరచుగా తీసుకుంటే శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కాబట్టి కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
జీర్ణ సంబంధిత సమస్యలు
చాలా మంది నిమ్మరసం జీర్ణక్రియకు సాయపడుతుందని అనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో తాగితే కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి ఆమ్లత, గుండెల్లో మంట, వికారం, గ్యాస్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది.
మూత్రపిండాలపై ఒత్తిడి
నిమ్మరసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది మూత్ర సంబంధిత సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఒకేసారి ఎక్కువగా తాగకూడదు.
నిమ్మరసం తాగే సరైన సమయం
చాలా మంది బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతారు. కానీ డాక్టర్ల సలహా లేకుండా అలా చేయకూడదు. భోజనం తర్వాత లేదా ఆహారంతో కలిపి తీసుకుంటే చెడు ప్రభావాలు తగ్గుతాయి. అలాగే నిమ్మరసం తాగిన వెంటనే పాలు, పెరుగు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకపోవడం మంచిది.
ఆరోగ్యం కోసం నిమ్మరసం తాగాలనుకునే వారికి డాక్టర్లు ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నారు. సరైన మోతాదులో, సరైన సమయంలో తాగితే ఇది చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కానీ ఈ నియమాలు పాటించకపోతే శరీరానికి హానికరంగా మారే అవకాశం ఉంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




