Sugar Almond: చక్కెర బాదం అంటే ఏంటో తెలుసా..? చేదుగా ఉండే ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు..
చక్కెర బాదం అనేది ఆకాశం వైపు చూస్తూ ఉండే పండు, కాబట్టి దీనిని స్కై ఫ్రూట్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రత్యేకమైన పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టారు.
>>మీరు బాదం పప్పులను ఎక్కువగా తింటుంటారు. అవి తినడానికి రుచికరంగా ఉంటాయి. పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా చక్కెర బాదం తిన్నారా..? దీనిని ఆకాశ ఫలం అని కూడా అంటారు. షుగర్ బాదం అని పేరు ఉన్నప్పటికీ, తినడానికి మాత్రం చాలా చేదుగా ఉంటుంది. కానీ, ఈ షుగర్ ఆల్మండ్ ప్రయోజనాలు మాత్రం అద్భుతం . స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదం అనేక ఆగ్నేయాసియా దేశాల్లో ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది అధిక BP,బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్లకు పండ్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. కానీ, చక్కెర బాదం అనేది ఆకాశం వైపు చూస్తూ ఉండే పండు, కాబట్టి దీనిని స్కై ఫ్రూట్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రత్యేకమైన పండు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
చక్కెర బాదం అంటే ఏమిటి? చక్కెర బాదంపప్పులను స్కై ఫ్రూట్ అని కూడా పిలుస్తారు, ఇది మహోగని చెట్టుపై పెరిగే పండు. దానిని పగులగొట్టిన తరువాత, దాని నుండి వచ్చిన విత్తనాలను తింటారు. చక్కెర బాదంలో సపోనిన్ ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
చక్కెర బాదంలో పోషకాలు చక్కెర బాదంలో విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఫ్యాటీ యాసిడ్లు, నేచురల్, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు మరియు అనేక ఇతర పోషకాలు ఉంటాయి.షుగర్ బాదంపప్పులు కొద్దిగా చేదుగా ఉంటాయి.
షుగర్ ఆల్మండ్ బెనిఫిట్స్ >> బాదంపప్పును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
> నిద్రలేమి సమస్యను అధిగమించడానికి చక్కెర బాదం చాలా మేలు చేస్తుంది.
> రక్త ప్రసరణను మెరుగుపరచడానికి స్కై ఫ్రూట్ లేదా చక్కెర బాదం తినండి .
> మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే చక్కెర బాదం నీరు తాగడం మంచిది.
> చక్కెర బాదంపప్పుల వాడకం చర్మ వ్యాధులలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
చక్కెర బాదంపప్పు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు>> చక్కెర బాదం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
> లివర్ డ్యామేజ్ అయితే దాని వినియోగం మానేయాలి.
> చక్కెర బాదంపప్పు తిన్న తర్వాత వికారంగా అనిపిస్తే వెంటనే వాటిని తీసుకోవడం మానేయాలి.
మీకు థైరాయిడ్, కాలేయ వ్యాధి, కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే, చక్కెర బాదంపప్పును వైద్యుల సలహా మేరకు మాత్రమే తినండి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.