Funny Video: చేపలు తినాలనే కోరికతో రైలు ఆపేసిన డ్రైవర్.. వీడియో వైరలవడంతో..
రైలు డ్రైవర్ తినడం కోసం రైలును మధ్యలో ఆపడం ఎప్పుడైనా చూసారా? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.
ప్రపంచంలో ఆహార ప్రియులకు కొదవలేదు. అలాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, తినడానికి వెనుకాడరు. ఏదైనా తినాలనే కోరిక ఉంటే అర్థరాత్రి కూడా కారు ఎక్కె తినటానికి వెళ్లిపోతారు. ప్రపంచంలో ఆహారం, పానీయాలకు మాత్రమే ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రజలు చాలా దూరం నుండి అలాంటి ప్రదేశాలకు తినడానికి మాత్రమే వెళ్తుంటారు. బైకులోనో, కారులోనో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు తిని, తాగడానికి మార్గమధ్యంలో ఎక్కడంటే అక్కడే ఆగిపోవడం మీరు తరచూ చూసే ఉంటారు. కానీ, రైలు డ్రైవర్ తినడం కోసం రైలును మధ్యలో ఆపడం ఎప్పుడైనా చూసారా? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.
నిజానికి ఈ వీడియోలో ఓ రైలు డ్రైవర్ రైలును మార్గమధ్యలో ఆపి చేపలు కొనడానికి వెళ్లాడు. కోరుకున్న చేపలు కొన్న తర్వాత పరుగున వచ్చి రైలును స్టార్ట్ ప్రారంభించాడు. ఓ రైల్వే గేటు దగ్గర రైలు ఆపి, రైల్వే గేటు మూసి ఉండడం వీడియోలో చూడవచ్చు. రైలు ముందుకు వెళ్లి గేట్లు తెరిచినప్పుడు, వారు కూడా తమ దారిన తాము వెళ్లిపోతారని ఇరువైపులా ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ రైలు డ్రైవర్ మాత్రం అక్కడే బండిని ఆపేసి చేపలు కొనేందుకు వెళ్లాడు. తిరిగి రాగానే రైలుకు పచ్చజెండా ఊపడంతో రైలు ముందుకు కదిలింది. రైలు డ్రైవర్ ఇలాంటి షాపింగ్ పేరుతో రైలును ఆపివేయడం వంటి దృశ్యాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు.
ये साहब गाड़ी खड़ी करके मछली खरीदने गए थे। कोन सि गाड़ी ये भी देखो। pic.twitter.com/RjL97bzxGE
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) December 26, 2022
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDతో షేర్ చేయబడింది. అది ఏ వాహనం అని చూడండి. ఈ పెద్దమనిషి తన కారును పార్క్ చేసి చేపలు కొనడానికి వెళ్లాడు అనే క్యాప్షన్‌లో రాసుకోచ్చారు. కేవలం 44 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 27 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.
ప్రజలు వీడియోను చూసిన తర్వాత వివిధ ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు చేపల మీద ఇష్టం అంటే అలాంటిది మరీ.. అంటూ రాస్తే, మరోక వినియోగదారు ప్రజలు యూపీ బీహార్ పేరును పనికిరాకుండా పాడు చేస్తున్నారు. ఈ విషయంలో భారతదేశం అంతా ఒక్కటే అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.